బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునక్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీకానున్నారు.ఇండోనేషియాలోని బాలిలో సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
బాలీలో వచ్చే నెల జీ 20 లీడర్ షిప్ సమ్మిట్ జరగబోతోంది.ఈ సమావేశాల్లో ఇరువురు ప్రత్యేకంగా భేటీ అవనున్నారు.
ఇందుకు సంబంధించి బ్రిటన్ ప్రధాని కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ లు ప్రపంచ ఆర్థిక శక్తులుగా మరింత వికసించేందుకు ఆ దేశాల అధినేతలు కలిసికట్టుగా పని చేయనున్నారని పేర్కొంది.







