వీడియో: సముద్రంలోకి దూకి చేపను పట్టేసిన పక్షి.. ఎంత అద్భుతంగా బయటికి వచ్చిందో..

ఓస్ప్రే( Osprey ) అనే డేగ చేపలు పట్టడంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటుంది.6 అడుగుల వరకు దీని రెక్కలు పెరుగుతాయి.

నీటి పైన ఎగురుతూ, అది తన పదునైన కంటి చూపుతో వాటర్‌ను స్కాన్ చేస్తుంది, నీటిలో ఏదైనా చాప కనిపిస్తే చాలు వెంటనే అది వేగంగా ఒక రాకెట్ లాగా కిందికి దూసుకొస్తుంది.

అనంతరం నీటి లోపలికి వెళ్లి చేపను పట్టుకుంటుంది.ఆపై చాలా వేగంగా మళ్లీ నీటి నుంచి బయటకు వచ్చి రెక్కలు ఆడిస్తూ గాలిలో ఎగిరిపోతుంది.తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే అది చేపలను ఎలా వేటాడుతుందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

ఈ వీడియోను @marktakesphoto ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.24 లక్షలకు పైగా దీనికి వ్యూస్ వచ్చాయి.ఈ క్లిప్‌లో ఓస్ప్రే పక్షి తన బలమైన పంజాతో చేపను పట్టుకుని ఆపై గాల్లో ఎగిరిపోవడం చూడవచ్చు.

సాధారణంగా ఓస్ప్రే పక్షి శరీరం చాలా దృఢంగా ఉంటుంది, పదునైన, శక్తివంతమైన కాళ్లతో అది లోతైన నీటి నుంచి చేపలను ఈజీగా పట్టుకోగలుగుతుంది.ఓస్ప్రేకి ఇష్టమైన ఆహారంలో ఒకటి బార్రాకుడా చేప.

Advertisement

ఈ చేపలు పదునైన దంతాలతో పొడవుగా, సన్నగా ఉంటాయి.అయితే బార్రాకుడా చేపలను ఎలా పట్టుకోవాలో, వాటి దాడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఓస్ప్రే పక్షులకు బాగా తెలుస్తుంది.అందుకే అవి వీటిని ఈజీగా హ్యాండిల్ చేస్తుంటాయి.

నీటి నుంచి ఓస్ప్రే పైకి లేస్తున్న దృశ్యాలను వీడియోలో గమనించవచ్చు.ఈ ఫుటేజ్ సూపర్ గా ఉందని చాలామంది పొగుడుతున్నారు.

బార్రాకుడా చేపను పట్టుకున్న తర్వాత దానిని ఈ పక్షి గూడుకు తీసుకువెళుతుంది, అక్కడ పిల్లలకు భోజనంగా పెడుతుంది.

కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?
Advertisement

తాజా వార్తలు