ఏపీలో కేబినెట్ భేటీకి ముహుర్తం ఖరారు అయింది.ఈ మేరకు ఈనెల 14న సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది.
కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.కాగా ఈ సమావేశానికి మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
అలాగే కేబినెట్ అజెండా అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు.ఇందులో భాగంగానే ఇటీవల బీభత్సం సృష్టించిన మిగ్జామ్ తుఫాను నష్టపరిహారంపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.







