ఆ హీరో వల్ల లక్షలు కోల్పోయాను.. వేణు కామెంట్స్ వైరల్!

స్వయంవరం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు వేణు అనంతరం పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.

ఈ విధంగా ఈయన హీరోగా మాత్రమే కాకుండా పలు సినిమాలలో సహాయ నటుడిగా కూడా నటించారు.

ఇలా వరుస సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో బిజీగా ఉన్న వేణు ఉన్న ఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరమైన అతను తన వ్యాపారాలు చేసుకుంటూ బిజీగా ఉన్నానని అయితే లాక్ డౌన్ సమయంలో వెబ్ సిరీస్ లు చూడటం వల్ల తనకు నటనపై ఆసక్తి కలిగి రీఎంట్రీ ఇచ్చానని తెలిపారు.

తాజాగా ఈయన రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చారు.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న వేణు తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ నటుడు జగపతి బాబు ద్వారా తాను లక్షల రూపాయలు నష్టపోయామని వెల్లడించారు.జగపతిబాబు వేణు కలిసి హనుమాన్ జంక్షన్ ఖుషి ఖుషి వంటి సినిమాలలో నటించారు.

Venu Tottempudi Shocking Comments On Jagapati Babu Details, Venu,tollywood,jagap
Advertisement
Venu Tottempudi Shocking Comments On Jagapati Babu Details, Venu,tollywood,Jagap

ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా మంచి హిట్ అందుకున్నాయి.ఇకపోతే ఈ సినిమాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు.అయితే జగపతిబాబు నామినీగా ఉండి తెలిసిన వ్యక్తికి తనతో ఏకంగా 14 లక్షల రూపాయల డబ్బులు ఇప్పించారు.

అయితే ఆ వ్యక్తి ఇప్పటివరకు తనకు డబ్బు తిరిగి చెల్లించలేదని, ఆ విధంగా తాను లక్షల రూపాయలు నష్టపోయానని వేణు వెల్లడించారు.అయితే ఈ ఘటన తర్వాత జగపతిబాబును తాను పెద్దగా కలవలేదని, ఇకపోతే తనకు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం పెద్దగా ఇష్టం ఉండదు అంటూ ఈయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు