వాస్తు ప్రకారం ఆగ్నేయంలో ఈ వస్తువులుంటే.. కష్టాలు ఉండవు!

సాధారణంగా మన హిందువులు సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతో ఎక్కువగా విశ్వసిస్తారు.

ఈ క్రమంలోనే కొందరు ఎలాంటి పని చేయవలసినా దానిని వాస్తు ప్రకారమే చేస్తుంటారు.

అలాగే కొందరు ఇంటి నిర్మాణం చేపట్టినప్పటినుంచి ఇంటిలో అలంకరించుకునే ప్రతి వస్తువు వరకు తప్పనిసరిగా వాస్తు పాటిస్తూ వాస్తుశాస్త్రం ప్రకారమే నడుచుకుంటారు.కొన్నిసార్లు ఇలాంటివన్నీ కేవలం అపోహలని భావించినప్పటికీ కొన్ని విషయాలలో ప్రతి ఒక్కరు వాస్తు శాస్త్రాన్ని తప్పకుండా పాటించాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి.

మనం ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవుళ్ళు అధిపతిగా ఉంటారని భావిస్తాము.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క దిక్కును ఎంతో పవిత్రంగా భావిస్తూ.

ఏ దిక్కున ఏ విధమైనటువంటి వస్తువులు ఉంటే శుభపరిణామం కలుగుతుందో తెలుసుకొని ఆ దిక్కున ఆ వస్తువులను ఉంచుతాము.ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయ దిక్కులో ఏ విధమైనటువంటి వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాం.

Advertisement

ఆగ్నేయం అంటే అగ్నికి మూలం.ఆగ్నేయమూల ఎప్పుడూ కూడా ఈశాన్యం కంటే తక్కువగా ఉండాలి.ఈశాన్యం కంటే ఎక్కువగా ఉంటే ఆ ఇంటిలో నిత్యం సమస్యలు ఎదురవుతాయి.

ఇలా ఆగ్నేయమూల ఎక్కువగా ఉండటం వల్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం, ఇంట్లో స్త్రీలు అనారోగ్యానికి గురి కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.ఎక్కువగా ఆగ్నేయ మూల వంట చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.

అలాగే మన ఇంటి పై భాగంలో నిర్మించే వాటర్ ట్యాంక్ కూడా ఎప్పుడూ ఆగ్నేయం, వాయువ్యం తప్ప ఏ ఇతర మూలలో పెట్టుకోకూడదు.అలాగే ఆగ్నేయ దిశలో టాయిలెట్స్ కూడా నిర్మించుకోవచ్చు.

అయితే తూర్పు గోడకు అటాచ్డ్ గా ఉండాలి.ఈశాన్య మూలలో సంపు లేదా వాటర్ ట్యాంక్ ను ఆగ్నేయం మూలం కంటే ఎక్కువ లోతు తవ్వించాలి.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

ఇంటికి మెట్లు కూడా తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు.అయితే తూర్పు గోడకు తాకకుండా ఉండాలి.

Advertisement

వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయ దిశలో ఏవైనా లోపాలు ఉంటే స్త్రీల వల్ల కష్టాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు