అమెరికా : పాత పద్దతిలోనే హెచ్-1బి వీసా...

అగ్ర రాజ్యంలో ఉద్యోగం చేయడానికి ప్రపంచ దేశాల నుంచీ ఎంతోమంది అమెరికాకు వలసలు వెళ్తూ ఉంటారు.అలాంటి వారికి తప్పనిసరిగా హెచ్-1బి వీసా ఉండాల్సిందే.

ఈ వీసా ఆధారంగానే వలస వాసులు తమ భాగస్వాములను అమెరికా తీసుకువెళ్తారు.అయితే గతంలో అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలంటే ఎంతో సులువుగా హెచ్-1బి వీసా జారీ చేసే వారు కానీ ట్రంప్ హయాంలో ఎన్నికల ముందు కొన్ని ఆంక్షలు విధించడంతో హెచ్-1బి వీసా జారీల ప్రక్రియపై వలస వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.హెచ్-1బి వీసాలను అత్యధిక జీతాలు పొందే ప్రతిభ ఉన్న వారికెే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని భావించారు.అమెరికా ప్రతీ ఏడాది సుమారు 85 వేల హెచ్-1బి వీసాలను జారీ చేస్తోంది.

US Withdraws Proposal To Change H-1B Visa Selection Criteria, US, H1B Visa, Dona

ఇందులో నిర్ణీత కోటాలో 65 వేల మంది, అలాగే అక్కడ ఉన్నత చదువులు చదువుకునే వారికీ అదనంగా మరో 20 వేల వీసాలను అందిస్తోంది.వీటిని కేవలం లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసేవారు.

కానీ కేవలం అత్యంత ప్రతిభ కలిగిన వారికే అమెరికా ప్రవేశం కల్పించాలని భావించిన అప్పటి ట్రంప్ ప్రభుత్వం ఈ విషయంలో కఠినమైన నిబంధనలు విధించడంతో పాత లాటరీ విధానానికి స్వస్తి పలకాలని భావించింది.అయితే ట్రంప్ తీసుకువచ్చిన ఈ విధానంతో ఎన్నారైల నుంచీ అలాగే టెక్ కంపెనీల నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో తమకు అన్యాయం జరుగుతోందని కొందరు ఎన్నారైలు కోర్టును ఆశ్రయించారు.

Advertisement

దాంతో గడిచిన సెప్టెంబర్ నెలలో నూతన విధానాన్ని కోర్టు తప్పుబడుతూ పాత విధానాన్ని కొనసాగించాలని తీర్పు చెప్పింది.దాంతో గతంలో నిర్వహించినట్టుగా లాటరీ విధానం ద్వారానే హెచ్-1బి వీసాలను జారీ చేయాలని బిడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే.కేవలం అత్యధిక జీతాల ద్వారా వీసాలను జారీ చేయాల్సి వస్తే అందులో కూడా భారతీయులే ముందు వరుసలో ఉంటారని అంటున్నారు నిపుణులు.

Advertisement

తాజా వార్తలు