అమెరికా సంచలన నిర్ణయం...తెలుగు శాస్త్రవేత్తపై నిషేధం...!!!

అమెరికా ప్రభుత్వంలోని కొన్ని కీలక విభాగాలు ప్రయోగాత్మకమైన పరిశోధనలు చేపడుతూ ఉంటాయి.ఈ పరిశోధనల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆహ్వానిస్తాయి.

అత్యుత్తమమైన పరిశోధనలకుగాను గుర్తింపు, గౌరవం కూడా అందిస్తాయి.ఈ క్రమంలోనే అమెరికా కీలక విభాగానికి చెందిన ఓ సంస్థ జన్యుపరమైన అంశాలపై పరిశోధనలకు ఆహ్వానం అందించింది.

దాంతో అమెరికాలో ఉండే ఇద్దరు తెలుగు ఎన్నారై శాస్త్రవేత్తలతో పాటు తెలంగాణలోని OU వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కూడా భాగస్వాములుగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.ముగ్గురూ కలిసి చేపట్టిన ఈ పరిశోధన ప్రఖ్యాత నేచర్ జర్నల్ లోని సైంటిఫిక్ రిపోర్ట్స్ లో పబ్లిష్ అయ్యింది.

అయితే పరిశోధన ఫలితాలపై అనుమానం వచ్చి లోతైన విచారణ చేపట్టిన అమెరికా ఆఫీస్ ఆఫ్ రీసెర్చ్ ఇంటిగ్రిటీ వారికి అసలు విషయం అర్థమయ్యింది.వారు ప్రచురించిన పరిశోధన నకిలీ పరిశోధనని తేల్చి చెప్పింది.

Advertisement

దాంతో ఈ ముగ్గురులో ప్రధాన శాస్త్రవేత్తపై నిర్వాహకులు సీరియస్ అయ్యారు.అమెరికా ప్రభుత్వ నిధులతో చేపట్టే ఎలాంటి పరిసోధనల్లో 5ఏళ్ళ పాటు పాల్గొనకుండా నిషేధం విధించారు.

ఈ పరిస్థితులు మరొక్క సారి జరగకుండా ఉండాలని హెచ్చరించారు.ఇదిలాఉంటే ఈ మొత్తం నకిలీ పరిశోధనలో హైదరాబాద్ లోని OU ప్రొఫెసర్ సహా బాగాస్వామిగా ఉన్నట్లుగా గుర్తించి అమెరికా ఫెడరల్ రిజిస్టర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ నుంచీ భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి నివేదిక అందించింది.

దాంతో ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టలాని కేంద్రం OU కు లేఖను రాసింది.ఈ విషయంపై స్పందించిన కీలక అధికారి ఈ విషయంపై విచారణ చేపదుతున్నామని ప్రకటించారు.

కాగా వీరి పరిశోధనను వెబ్సైటు నుంచీ తొలగించినట్టుగా నేచర్ జర్నల్ తాజాగా ప్రకటించింది.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు