బుల్లితెరపై బిగ్ బాస్ షో హవా మొదలైంది.కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో బిగ్ బాస్ షోను చూడటానికి బిగ్ బాస్ అభిమానులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు.
తొలివారం ఏడుపులతో సాగిన బిగ్ బాస్ షో రెండో వారం ట్రైయాంగిల్ లవ్ స్టోరీ వల్ల ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.గత సీజన్ లో పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ లవ్ స్టోరీ వల్ల షోపై ప్రేక్షకుల్లో క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే.
అయితే ఈసారి ఇద్దరు కంటెస్టెంట్లు ఒకే అమ్మాయితో సన్నిహితంగా మెలుగుతుండటంతో షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో ఒకరైన అభిజిత్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా అభిజిత్ ప్రేక్షకులకు సుపరిచితం.అయితే అభిజిత్ అక్కినేని ఫ్యామిలీకి చాలా సన్నిహితుడని తెలుస్తోంది.
అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్, అభిజిత్ క్లాస్ మేట్స్.వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అని సమాచారం.చైతన్య విద్యాలయలో వీళ్లిద్దరూ కలిసి చదువుకున్నారు.అక్కినేని అఖిల్ ఫ్రెండ్ అయిన అభిజిత్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అక్కినేని అమల కొడుకుగా నటించడం గమనార్హం.ఈ విధంగా అక్కినేని ఫ్యామిలీకి, అభిజిత్ కు మధ్య కూడా అనుబంధం ఉంది.అభిజిత్ పూర్తి పేరు అభిజిత్ దుద్దుల.
అభిజిత్ పూర్వీకులు హైదరాబాద్ లోని ఛార్మినార్ నిర్మాణంలో పని చేశారు.అభిజిత్ కుటుంబం నిర్మాణ పనులు, కాంట్రాక్టులపై ఆధారపడి జీవిస్తోంది.
తొలి వారం కొంచెం సైలెంట్ గా ఉన్న అభిజిత్ మోనాల్ తో లవ్ ట్రాక్ ద్వారా హైలెట్ అయ్యాడు.వీక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తున్న అభిజిత్ కు ఓట్లు బాగానే పడుతున్నాయని సమాచారం.
మోనాల్ ను అభిజిత్ ఇష్టపడుతోంటే అభిజిత్ ను హారిక ఇష్టపడుతూ ఉండటం గమనార్హం.