కృష్ణ హీరో అవుతాడని ముందే చెప్పిన నాగరత్నమ్మ..

తమ పిల్లలు ఏం కాబోతున్నారో మొదట గుర్తించేది తన తల్లిదండ్రులు మాత్రమే.

మరీ చెప్పాలంటే తల్లి మాత్రమే తమ పిల్లలు ఎలాంటి జీవితాన్ని లీడ్ చేయబోతున్నారో ఒక అంచనాకు వస్తుంది.

అలాగే సూపర్ స్టార్ కృష్ణ. సినిమా రంగంలో కనీవినీ ఎరుగని రీతిలో గుర్తింపు పొందుతాడని ముందు గుర్తించింది తన తల్లి నాగరత్నమ్మ.

సినిమా రంగంలో ఇవాళ కృష్ణ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే దానికి కారణం ఆమే అని చెప్పుకోవచ్చు.తన కొడుకు చిన్న వాడిగా ఉన్నప్పుడే మరో ఎన్టీఆర్ కాబోతున్నాడు అని గుర్తించింది నాగరత్నమ్మ.

ఎప్పుడూ ఊరు విడిచి ఉండని తను.తన కొడుకును తీసుకుని ఏకంగా మద్రాసుకు వెళ్లింది.ఆమెను చూసి జనం నవ్వారు.

Advertisement
Unknown Facts About Hero Krishna Mother, Krishna Mother, Naga Rathnamma, Krishna

అయినా తను పట్టించుకోలేదు.మద్రాసులో ఓ గదిని అద్దెకు తీసుకుని సినిమాల కోసం ప్రయత్నాలు చేసింది.

కృష్ణ సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే.అతడికి భోజనం వండి తీసుకెళ్లేది.

సినిమా ఆఫీసుల దగ్గర దర్శక నిర్మాతలను కలిసి తమ అబ్బాయి బాగా నటిస్తాడని.ఒక్క అవకాశం ఇవ్వండి అని వేడుకునేది.

Unknown Facts About Hero Krishna Mother, Krishna Mother, Naga Rathnamma, Krishna

అటు నాగరత్నమ్మ కుటుంబానికి జగ్గయ్య బాగా పరిచయం.అప్పటికే తను సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నాడు.కొడుకు కృష్ణ కోసం ఆమె మద్రాసు వచ్చిందని.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుందని తెలుసుకున్నాడు.అదే సమయంలో తను పదండి ముందుకు అనే సినిమా చేస్తున్నాడు జగ్గయ్య.

Advertisement

ఈ సినిమాలో కృష్ణకు ఓ రోల్ ఇచ్చాడు.ఆ చిన్న వేషం కృష్ణకు ఎంతో విశ్వాసాన్ని కలిగించింది.

ఆ తర్వాత నెమ్మదిగా హీరో అయ్యాడు.అక్కడి నుంచి సక్సెఫుల్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు.

దానికి కారణం తన తల్లి అని చెప్పుకోవచ్చు.అందుకే చాలా సార్లు కృష్ణ తన తల్లి గురించి చెప్పేవాడు.

తాను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం తన తల్లే అని వెల్లడించాడు.తన తల్లి పట్ల కృష్ణకు అపారమైన ప్రేమ ఉండేది.

తాజా వార్తలు