అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవినీతిపై విచారణ జరపాలి

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల్లో జరిగిన అవినీతిపై వెంటనే న్యాయ విచారణ జరపాలని తెలంగాణా జనసమితి రాష్త్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి ధర్మార్జున్ డిమాండ్ చేశారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణంలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

అనంతరం అడ్మినిస్ట్రేషన్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ధర్మార్జున్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే,మంత్రి జగదీశ్ రెడ్డి ఆ నిర్మాణ సంస్థతో కుమ్మక్కై పనులు చేయకుండా బిల్లులు ఎత్తుకుని కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాధించుకున్న సూర్యాపేట జిల్లా కేంద్రం భౌగోలికంగా విస్తరిస్తూ వుంది.ప్రజా అవసరాలకు అనుకూలంగా ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వం సూర్యాపేట మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణంనకు నిధులు కేటాయించారు.

ఇట్టి నిర్మాణ పనులు టెండర్ దక్కించుకున్న సంస్థ కానీ,మున్సిపల్ అధికారులు కానీ,డి.పి.అర్ ప్రజల ముందు వుంచకుండా తమ ఇష్టానుసారంగా నాసిరకంగా నిర్మాణ పనులు చేపట్టి సంవత్సరాల తరబడి నిర్మాణం పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ, అవినీతికి పాల్పడుతూ,నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ధర్మార్జున్ విమర్శించారు.ఈ పనులే పూర్తికాలేదు కానీ,ఇంకో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం అంటూ టీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెబుతున్నారని విమర్శించారు.

Advertisement

మత్రికి శంకుస్థాపనలు, కాంట్రాక్ట్ కమీషన్ ల మీద వున్న శ్రద్ద పనులు పూర్తి చేయుటమీద లేదని విమర్శించారు.వెంటనే అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జనసమితి రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమాశంకర్,జిల్లా అధ్యక్షుడు మాండ్రా మల్లయ్య యాదవ్,పట్టణ అధ్యక్షులు బందన్ నాయక్ ఉపాధ్యక్షుడు బీసుస్వామి గౌడ్,ఎస్టీ సెల్ పట్టణ కన్వీనర్,దేవత్ సతీష్,యువజన సమితి నాయకులు హరీష్,డుంగ్రోత్ శ్యామ్,అశోక్,సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News