అమెరికా కోర్టులకు జడ్జిలుగా ఇద్దరు భారత సంతతి మహిళా లాయర్లు

అమెరికాలో ఇద్దరు భారత సంతతి మహిళా న్యాయవాదులను న్యూయార్క్‌లోని క్రిమినల్, సివిల్ కోర్టులకు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.

ఈ మేరకు న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో ఉత్తర్వులు జారీ చేశారు.

అర్చనారావును క్రిమినల్ కోర్టుకు, దీపా అంబేకర్‌ను సివిల్ కోర్టుకు జడ్జిలుగా నియమించారు.అర్చనా రావు 2019 జనవరిలో సివిల్ కోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

అంతకు ముందు ఆమె న్యూయార్క్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో 17 సంవత్సరాలు పనిచేశారు.ఇటీవల బ్యూరో చీఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌గాను వ్యవహరించారు.

అర్చనా రావు వాస్సార్ కాలేజీలో గ్రాడ్యుయేట్ చేసి, ఫోర్దామ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జూరిస్ డాక్టర్ డిగ్రీని అందుకున్నారు.

Advertisement

మరో భారత సంతతి మహిళ అంబేకర్ విషయానికి వస్తే.ఆమె 2018 మేలో సివిల్ కోర్టు తాత్కాలిక జడ్జిగా నియమితులయ్యారు.ఈ పదవిలో నియమించబడటానికి ముందు ఆమె న్యూయార్క్ సిటి కౌన్సిల్‌ సీనియర్ లెజిస్లేటివ్ అటార్నీగా, పబ్లిక్ సేఫ్టీ కమిటీకి న్యాయవాదిగా పనిచేశారు.

అంతేకాకుండా క్రిమినల్ డిఫెన్స్ డివిజన్‌లోని లీగల్ ఎయిడ్ సొసైటీలో స్టాఫ్ అటార్నీగానూ వ్యవహరించారు.అంబేకర్ మిచిగాన్‌ వర్సిటీ నంచి గ్రాడ్యుయేషన్, రట్జర్స్ లా స్కూల్ నుంచి జూరిస్ డాక్టర్ డిగ్రీని అందుకున్నారు.

కాగా ఫ్యామిలీ కోర్టు, క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టులకు న్యూయార్క్ మేయర్ మొత్తం 28 మందిని న్యాయమూర్తులుగా నియమించారు.ఈ మూడు కోర్టులు న్యూయార్క్ స్టేట్ యూనిఫైడ్ కోర్ట్ సిస్టమ్‌లో భాగం.

కమలా హారిస్ కార్యాలయంపై కాల్పులు .. ఉలిక్కిపడ్డ అమెరికా
Advertisement

తాజా వార్తలు