సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో మహేష్ బాక్సాఫీస్ రికార్డులను తిరిగి రాయడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, మెగాస్టార్ చిరంజీవి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
దాదాపు 13 ఏళ్ల తరువాత మెగాస్టార చిరంజీవి, విజయశాంతి ఒకే వేదికపై కనబడటంతో వారి అభిమానులు వారిని చూసేందుకు ఎగబడ్డారు.ఈ కారణంగా సరిలేరు నీకెవ్వరు ఈవెంట్లో మహేష్ అభిమానులకంటే చిరు-విజయశాంతిల అభిమానుల సందడే ఎక్కువగా కనిపించడం, సోషల్ మీడియాలో కూడా చిరు-విజయశాంతిలకు సంబంధించన వార్తలే ఎక్కవ ప్రమోట్ కావడంతో మహేష్ భార్య నమ్రత చాలా అప్సెట్ అయ్యారట.
మహేష్ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో వీరిద్దరి ప్రమోషన్స్ ఏమిటని ఆమె బాగా ఫీలయ్యిందని తెలుస్తోంది.కాగా ఈ విషయంపై మహేష్ అండ్ ఫ్యామిలీ కూడా సైలెంట్‌గానే ఉన్నారు.
కాగా సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.







