ఆ డైరెక్టర్ తిట్టాడంటున్న బుల్లితెర నటి!

బుల్లితెర క్వీన్.మీ తిట్లే మాకు దీవెన‌లంటూ తెగ సంబ‌ర‌ప‌డిపోతుంది.ఎవ‌రైనా తిడితే సంతోష‌ప‌డ‌తారా.

? ఇదేం లాజిక్కూ అని తిట్టుకోకండి.మిని కాశ్మీర్ క‌ర్ణాట‌క కూర్గ్ ప్రాంతానికి చెందిన క‌న్న‌డ కుట్టి చైత్ర రాయ్ క‌న్న‌డ‌, తెలుగు బుల్లి తెర పై ఓ వెలుగు వెలిగిపోతుంది.

హోట‌ల్ మేనేజ్మెంట్ చ‌దివే స‌మ‌యంలో కాఫీడే లో వ‌ర్క్ చేస్తున్న చైత్ర రాయ్ ను చూసిన క‌న్న‌డ కు చెందిన వెండితెర ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెను చూసి ఫిదా అయ్యారు.తీస్తే ఈమెతో సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యారు.

అంతే అదే ద‌ర్శ‌క నిర్మాత‌లు చైత్ర రాయ్తో పాటు మ‌రికొంత‌మంది యాక్ట‌ర్స్ కు యాక్టింగ్ లో మెళుకువ‌లు నేర్పించారు.సాంగ్స్ రికార్డింగ్ పూర్తి చేసుకున్నారు.

Advertisement

కానీ అనేక కార‌ణాల వ‌ల్ల సినిమా షూటింగ్ సెట్ పైకి వెళ్ల‌క‌ ముందే ఆగిపోయింది.అయితే చైత్ర రాయ్ ముంబైలో యాక్టింగ్ నేర్చుకునే స‌మ‌యంలో ఆమె పాల్గొన్న ఫోటో సెష‌న్స్ మంచి క్లిక్ అయ్యాయి.

అవ‌కాశాలు వ‌రుస‌గా వ‌చ్చి ప‌డ్డాయి.అలా 2009లో ఉద‌య్ టీవీలో త‌న తొలి క‌న్న‌డ సీరియ‌ల్ కుసుమాంజ‌లి ద్వారా బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇచ్చింది.నాటి నుంచి నేటి వ‌ర‌కు వ‌రుస సీరియ‌ల్స్ లో క‌న్న‌డ, తెలుగులో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది.2013 తెలుగు అష్టా చెమ్మా సీరియ‌ల్ లో నెగిటీవ్ క్యార‌క్ట‌ర్ తో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి.పాజిటీవ్ వైబ్రేష‌న్ తో అభిమానుల్ని కంట త‌డిపెట్టిచ్చింది.

అలా తెలుగులో ఏడు సీరియ‌ల్స్, రెండు రియాలిటీ షోల‌తో త‌న హ‌వా కొన‌సాగిస్తున్న ఈ బుల్లితెర క్వీన్ చైత్ర రాయ్.కెరియ‌ర్ ప్రారంభంలో తాను ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ ను త‌లుచుకొని ఆనందప‌డిపోతుంది.కెరియ‌ర్ ప్రారంభంలో ఎవ‌రికైనా క‌ష్టాలు కామ‌న్.

ముఖ్యంగా నాలాంటి వాళ్లు మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే డైర‌క్ట‌ర్ తో తిట్లు తినాల్సిందే.అలా తొలి క‌న్న‌డ సీరియ‌ల్ డైర‌క్ట‌ర్ వినుబ‌ళంజ తిట్లు తిని న‌ట‌న‌లో మెళుకువ‌లు నేర్చుకున్న‌ట్లు గుర్తు చేసుకుంటుంది.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన

తెలుగులో యాక్టింగ్, భాష రాక ఇబ్బంది ప‌డుతుంటే డైర‌క్ట‌ర్లు జయకుమార్‌రెడ్డి, గోపికసిరెడ్డి, గోవిందలు త‌న‌కెంతో స‌హ‌క‌రించారంటూ క‌న్న‌డ కుట్టి చైత్ర రాయ్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు