ట్రంప్ అమెరికాలో అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీ ప్రకారం అమెరికా అభివృద్దిలో ఈ రోజు వరకూ కూడా తమవంతు ఎనలేని కృషి చేస్తున్న ఎన్నారై లపై ముఖ్యంగా భారతీయ ఎన్నారైలపై వారి భవిష్యత్తుపై ఉక్కుపాదం మోపుతున్నాడు.
ట్రంప్ హెచ్-1బీ జారీ ఫై అమలు చేయనున్న కొత్త నిభంధనలతో భారతీయులకి గడ్డుకాలమేనని చెప్పడంలో సందేహం లేదనే చెప్పాలి.
ట్రంప్ సర్కారు ఆదేశాల మేరకు హెచ్-1బీ వీసా గడువు పూర్తయినా లేదా పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోని, దరఖాస్తు తిరస్కరణకు గురైన వారిని అక్టోబరు ఒకటో తేదీ నుంచి స్వదేశానికి పంపించేందుకు అక్కడి అధికారులు చర్యలు ఇప్పటికే చేపట్టారు.అయితే ఈ ప్రభావం వలన దాదాపు 7 లక్షల మంది భారతీయులపై పడనుంది.వీసా గడువు ముగిసిన తర్వాత 240 రోజుల వరకు అమెరికాలో ఉండే అవకాశముంది.
అయితే గడువు ముగిసేలోగా హెచ్-1బీ వీసా పునరుద్ధరణ జరిగితే అక్కడ కొనసాగవచ్చు.వీసా పునరుద్ధరణ జరగకపోతే వెంటనే అమెరికా వదిలి వెళ్లిపోవాలి.
వీసా పునరుద్ధరణ దరఖాస్తు తిరస్కరణకు గురైనా అనధికారికంగా అక్కడ నివసించే వారిని తమ ముందు హాజరు కావాల్సిందిగా(నోటీస్ టు అప్పీయర్-ఎన్‌టీఏ) అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం(యూఎస్ సిటిజన్‌షి్‌ప అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీ్‌స-యూఎ్‌ససీఐఎస్) ఆదేశిస్తుంది.
అయితే ఎన్‌టీఏ ఒకసారి జారీ అయితే సదరు వ్యక్తి ఉద్యోగంలో కొనసాగడానికి వీల్లేదు.విచారణ పూర్తయ్యే వరకు మాత్రమే అమెరికాలో ఉండేందుకు అనుమతి ఇస్తారు.ఈ కాలంలో వీసా గడువు తీరిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్ అధికారి ఎదుట హాజరు కావాలి.
ఆ సమయంలో సదరు వ్యక్తి అమెరికాలో లేకుంటే అతడిపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తారు.అయితే ఈ ఎఫెక్ట్ తో నష్టపోయే జాబితాలో భారతీయులు ముందు ఉంటే ఆ తరువాత జాబితాలో చైనీయులు ఉన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy