త్రివిక్రమ్‌ హ్యాండ్‌ పడటంతో టిల్లు గాడి లెవల్ మారిపోయింది

సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి లు జంటగా నటించిన డీజే టిల్లు సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది.

ట్రైలర్ విడుదల తర్వాత సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి.ఇక బిజినెస్ కూడా అమాంతం పెరిగింది.

డీజే టిల్లు టైటిల్ సాంగ్ ఇప్పటికే ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.ట్రైలర్ లో ఉన్న సిద్ధూ డైలాగ్స్ యూత్ ఆడియన్స్‌ కి బాగా కనెక్ట్ అయ్యాయి.

ముఖ్యంగా అమ్మాయిలతో లవ్వంటే ఎలా ఉంటుంది అనే సన్నివేశాలకు సిద్ధు ఆకట్టుకునే విధంగా డైలాగ్స్ రాశాడు.ఆయన యూత్‌ కు కనెక్ట్‌ అయ్యేలా డీజే టిల్లు ను మార్చేశాడు.

Advertisement
Trivikram Is Back Role For Siddu DJ Tillu Movie , DJ Tillu , Film News , Siddu

సినిమా డైలాగ్స్ యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా రాశాడు అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

Trivikram Is Back Role For Siddu Dj Tillu Movie , Dj Tillu , Film News , Siddu

కచ్చితంగా యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ గా ఈ సినిమా నిలుస్తుందని అభిప్రాయం తో ప్రతి ఒక్కరు ఉన్నారు.ఇక ఈ సినిమా కు త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ నుండి మొదలుకుని ఎడిటింగ్ వరకు సలహాలు ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి.స్వయంగా హీరో సిద్ధు మాట్లాడుతూ త్రివిక్రమ్ గారి తో ఈ సినిమాకు వర్క్ చేయడం ఆనందంగా ఉంది అన్నాడు.

అంటే ఆయన ఆది నుండి అంతం వరకు అన్ని విషయాల్లో కూడా భాగస్వామ్యం వహించి ఉంటాడని సమాచారం అందుతోంది.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమా లో కూడా త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనే వాదన ఉంది.

కనుక డీజే టిల్లు సినిమా లో కూడా ఖచ్చితంగా ఆయన హ్యాండ్ ఉండే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో సినిమా అంటే ఓ రేంజిలో అంచనాలు ఉంటాయి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఆయన దర్శకత్వం వహించకున్నా కూడా ఆయన పర్యవేక్షణలో వస్తున్న సినిమా కనుక డీజే టిల్లు సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.కేవలం ఈ సినిమాకే కాకుండా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కి కూడా త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు