సంచలనం సృష్టించిన త్రిష..

ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులకు గర్వకారణంగా నిలుస్తున్న ఐసీసీ అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ 2025లో భారత మహిళల జట్టు వరుసగా విజయాలు సాధించింది.

స్కాట్లాండ్‌తో జనవరి 28న జరిగిన సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో టీమిండియా 150 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది భారత ఓపెనర్‌, తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చెప్పవచ్చు.భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో ఒకే వికెట్‌ నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఓపెనర్‌ గొంగడి త్రిష చెలరేగి 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో శతకం పూర్తి చేసి మొత్తం 59 బంతుల్లో 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.త్రిషతో పాటు మరో ఓపెనర్‌ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో రాణించింది.

వన్‌డౌన్‌ బ్యాటర్‌ సనికా ఛల్కే కూడా 20 బంతుల్లో 29 పరుగులు చేసింది.

Advertisement

ఇక ఆ తర్వాత 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ జట్టును భారత బౌలర్లు పూర్తిగా అదుపులో పెట్టారు.స్కాట్లాండ్‌ 14 ఓవర్లలో కేవలం 58 పరుగులకే ఆలౌట్‌ అయింది.గొంగడి త్రిష బంతితోనూ మళ్లీ మెరిసి 2 ఓవర్లలో 6 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీసింది.

అయూషి శుక్లా 3 ఓవర్లలో 8 పరుగులు, 4 వికెట్లు, వైష్ణవి శర్మ 2 ఓవర్లలో 5 పరుగులు, 3 వికెట్లు తీసి అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన చేశారు.

ఈ గెలుపు కంటే ముందే భారత్‌ సెమీస్‌కు అర్హత సాధించింది.గ్రూప్‌-1 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా జట్లు.గ్రూప్‌-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లు సెమీస్‌కు చేరాయి.టోర్నీలో భారత్‌ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఐదింట్లో విజయాలు సాధించింది.

భారత యువ మహిళల జట్టు ఇప్పటికే తమ అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థులను భయపెట్టే స్థాయికి చేరుకుంది.సెమీఫైనల్‌ దిశగా జట్టు మరింత దూకుడుగా సాగుతోంది.గొంగడి త్రిష వంటి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన భారత విజయయాత్రను మరింత బలపరుస్తోంది.

రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం.. వైరల్ వీడియో
Advertisement

తాజా వార్తలు