రేపటి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర

తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభంకానుంది.

ఈ మేరకు మొదటి రెండు రోజుల షెడ్యూల్ ను ములుగు ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క - సారలమ్మల సన్నిధానం నుంచి రేపు పాదయాత్ర ప్రారంభంకానుంది.అదేవిధంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర ముఖ్యనేతలు వేర్వేరు నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చేందుకే ఏఐసీసీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సీతక్క స్పష్టం చేశారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు