ఏలూరు జిల్లా రొయ్యల చెరువుల్లో విష ప్రయోగం

ఏలూరు జిల్లాలోని రొయ్యల చెరువుల్లో విషప్రయోగం జరిగింది.భీమడోలు మండలం సాయన్నపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఒంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన కృష్ణం రాజు అనే వ్యక్తి సాయన్నపాలెంలో ఏడు ఎకరాలలో రొయ్యల చెరువును సాగు చేస్తున్నారు.అయితే ఈనెల 29వ తేదీ రాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు చెరువుల్లో విష ప్రయోగం చేశారని తెలుస్తోంది.

దీంతో చెరువులోని రొయ్యలు అన్నీ చనిపోగా రూ.లక్ష నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీరుమున్నీరు అవుతున్నారు.అనంతరం బాధితుడు కృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఎలుకల మందు చెరువులో కలపడం వలన రొయ్యలు చనిపోయాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు