వరుస సినిమాలతో దుమ్మురేపుతున్న టాలీవుడ్ యంగ్ హీరోలు

తెలుగు సినిమా పరిశ్రమలోకి కొత్తనీరు వచ్చి చేరుతుంది.యాక్టింగ్ లో దమ్ము ఉండాలే కానీ.

ఎవరూ ఆపలేరని నిరూపిస్తున్నారు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు.ఎప్పుడొచ్చామన్నది కాదు.

బుల్లెట్ దిగిందా లేదా? అనే రీతిలో ముందుకు సాగుతున్నారు.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్మురేపుతున్నారు.

టాలీవుడ్ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇంతకీ కొత్తగా వచ్చి వరుస సినిమాలు చేస్తున్న యంగ్ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Tollywood Young Heros Movies, Tollywood Heroes, Latest Movies, Anand Devarakonda

*కార్తికేయ

కార్తికేయ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తాజాగా సినిమా యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లో ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.హీరోయిన్ గా రుహానీ శర్మను ఎంపిక చేశారు.

అటు అజిత్‌తో కలిసి వాలిమై సినిమా చేస్తున్న కార్తికేయ.రాజా విక్రమార్క అనే మరో మూవీలో నటిస్తున్నాడు.

*కిరణ్ అబ్బవరం

Tollywood Young Heros Movies, Tollywood Heroes, Latest Movies, Anand Devarakonda

కిరణ్ నటించిన తొలి సినిమా ఎస్.ఆర్.కళ్యాణమండపం.లాక్ డౌన్ కు ముందే విడుదల చేయాలని భావించినా కుదరలేదు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు.. అసలేం జరిగిందంటే?

ఇప్పటికీ ఆ సినిమా విడుదల కాలేదు.అయినా తను వరుస బెట్టి సినిమాలు చేస్తున్నారు.

Advertisement

తాజాగా సెబాస్టియన్ అనే మూవీలో నటిస్తున్నాడు.వీటితో పాటు కోడి రామకృష్ణ బ్యానర్‌లో తాజాగా ఓ సినిమా చేస్తుండగా.

.సమ్మతమే అనే మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

*సత్యదేవ్

కొత్తకథలతో ఆకట్టుకునే యంగ్ హీరో సత్యదేవ్.ఈయన కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.తాజాగా తమన్నాతో కలిసి గుర్తుందా శీతాకాలం అనే మూవీ చేస్తున్నాడు.

అటు గాడ్సే అనే మరో ప్రాజెక్టులోనూ కొనసాగుతున్నాడు.ఈ రెండింటికి తోడు స్కైలాబ్ అనే మరో డిఫరెంట్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు.

అటు ఈయన నటించిన తిమ్మరుసు అనే సినిమా వచ్చేనెలలో విడుదల కానుంది.

*ఆనంద్ దేవరకొండ

అటు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా బాగా బిజీ అయ్యిడు.దొరసాని సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు.మిడిల్ క్లాస్ మెలొడిస్ తో అందరినీ మెప్పించాడు.

తాజాగా ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.కెవి.

గుహన్ దర్శకత్వంలో హైవే అనే సినిమా చేస్తున్నాడు.అటు దామోదర దర్శకత్వంలో పుష్పక విమానం అనే సినిమాలో నటిస్తున్నాడు.

తాజా వార్తలు