మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో క్రేజీ పాత్రలు పోషిస్తున్న తెలుగు హీరో హీరోయిన్స్

ఒకప్పుడు బాలీవుడ్ అంటే నార్త్ నటీనటులతోనే నిండిపోయి ఉండేది.సౌత్ వాళ్లకు అంతగా ప్రవేశం ఉండేది కాదు.

కానీ ప్రస్తుతం ఆ పద్దతి మారింది.సౌత్ సినిమా పరిశ్రమ నార్త్ పరిశ్రమను డామినేట్ చేస్తుంది.

ఒకప్పుడు హిందీ సినిమా అంటే ఓ రేంజిలో ఊహించుకునే సౌత్ దర్శకులు ప్రస్తుతం.నార్త్ దర్శకులను మించి సినిమాలు చేస్తున్నారు.

అద్భుత కథలను ఎంచుకోవడంతో పాటు టేకింగ్ లెవల్స్ కూడా అదిరిపోయేలా చూసుకుంటున్నారు.తాజాగా టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు బాలీవుడ్ తో క్రేజీ సినిమాలు చేస్తున్నారు.

Advertisement
Tollywood Stars Crazy Entry In Bollywood Movies, Tollywood Stars, Bollywood Movi

ఇంతకీ హిందీలో సినిమాలు చేస్తున్న ఆ హీరోలు, హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

సమంత- నాగ చైతన్య

Tollywood Stars Crazy Entry In Bollywood Movies, Tollywood Stars, Bollywood Movi

అక్కినేని ఇంటి కోడలు సమంత హిందీ వెబ్ సిరీస్ తో మస్త్ క్రేజ్ సంపాదించుకుంది.ది ఫ్యామిలీమెన్- 2లో తన అద్భుత నటనతో అదరగొట్టింది.ప్రస్తుతం హిందీలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఆమె ముందుకు వచ్చి వాలుతున్నాయి.

పలువురు సినిమా నిర్మాతలకు తనతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.అటు సమంత భర్త నాగచైతన్య కూడా పలు సినిమాలు చేస్తున్నాడు.

తాజాగా ఆయన అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దాలో నటిస్తున్నాడు.ఈ సినిమాతో తొలిసారి బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
ఆ సీన్ కోసం చరణ్ మూవీ గ్లింప్స్ 1000 సార్లు చూస్తారట.. అసలేం జరిగిందంటే?

మరోవైపు 83 సినిమాతో జీవా హిందీ చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.ముంబైకర్ మూవీతో విజయ్ సేతుపతి హిందీలోకి వెళ్తున్నాడు.

రష్మిక మందాన - విజయ్ దేవరకొండ

Advertisement

గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ఆకట్టుకున్న లవ్లీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందాన.వీరిద్దరు ప్రస్తుతం బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు.పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్.

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి లైగర్ అనే మూవీ చేస్తున్నాడు.పూరీ, చార్మీలకు కరణ్ జోహార్ తోడవడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇందులో అనన్య పాండే హీరోయిన్ గా చేస్తుంది.రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తుంది.

ఇప్పటికే విజయ్ మూవీ అర్జున్ రెడ్డి హిందీలోకి రీమేక్ అయ్యింది.దీంతో అతడి తాజా సినిమాపై మంచి హోప్ ఏర్పడింది.

అటు సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా చేస్తున్న మిషన్ మజ్ను సినిమాతో రష్మిక బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది.అటు బిగ్ బీతో కలిసి గుడ్ బై అనే సినిమాలోనూ నటిస్తోంది.

తాజా వార్తలు