తొందరపడి సినిమాను విడుదల చేసి పరువు పోగొట్టుకున్న స్టార్ హీరోస్

ఈ సినిమా కైనా ఒక లెక్క ఉంటుంది ఎన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలి.ఎప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించాలి.

ఎలా దానిని విడుదల చేయాలి అంటూ డైరెక్టర్ నిర్మాతలు అందరూ కలిసి ఒక లెక్క వేసుకుని మరి సినిమాను తీస్తారు కానీ తొందరపడి ముందే ఒక డేట్ ప్రకటించిన తర్వాత ఆ డేట్ కి సినిమా పూర్తి కాకపోతే అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడానికి కష్టంగా ఉంటుంది అయినా కూడా ప్రకటించిన డేట్ కె సినిమా రావాలి అని తొందరపడి కొంతమంది దర్శకుడు చేసిన పొరపాట్ల వల్ల ఆ సినిమా అసలుకే ఎసరు వచ్చేలా అట్టర్ ప్లాప్ చిత్రం అయినా కూర్చుంటుంది.అలా తొందరపడి రిలీజ్ చేసి పరువు పోగొట్టుకున్న ఆ సినిమాలు ఏంటి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పొన్నియన్ సెల్వన్ సినిమా( Ponniyin Selvan ) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ సినిమా ఎంతో చరిత్రతో ముడిపడి ఉంది.భారీ క్యాస్టింగ్ అలాగే భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చి బొక్క బోర్లా పడింది.

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ దాదాపు రెండు నుంచి మూడు ఏళ్ల వరకు అయినా తీస్తారు అని అందరు అనుకున్నా కేవలం 150 రోజుల్లోనే ఇంత పెద్ద సినిమాని పూర్తి చేశారు దర్శకుడు మణిరత్నం( Mani Ratnam ) దానివల్లనే అనుకున్న డేట్ కి సినిమా అయితే వచ్చింది కానీ రిజల్ట్ మాత్రం రివర్స్ అయ్యింది.ఇక నితిన్( Nithin ) హీరోగా నటించిన లై సినిమా( Lie Movie ) పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది.

Advertisement

తొందరపడి ఒక డేట్ ప్రకటించిన తర్వాత ఆ టైంకి షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా సెకండ్ హాఫ్ అస్తవ్యస్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నితిన్ ఖాతాలో ఒక పరాజయాన్ని మిగిల్చింది.ఇక పాన్ ఇండియన్ సంచలన స్టార్ అయిన నిఖిల్ సైతం తన స్పై మూవీ( Spy Movie ) చిత్రం విషయంలో ఇలాంటి తొందర పాటు నిర్ణయాన్ని తీసుకున్నాడు.అసలు ఈ సినిమా విడుదలైన రోజుకు కరెక్ట్ గా నెల ముందు కూడా షూటింగ్ చాలా వరకు పెండింగ్ ఉంది.

నెల రోజుల వ్యవధిలోనే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసే విడుదల చేశారు.దాంతో సినిమా క్వాలిటీ పూర్తిగా లోపించింది.ప్రేక్షకులకు ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదు.

Advertisement

తాజా వార్తలు