తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ( Hero Ravi Teja ) కి చాలా మంచి గుర్తింపు ఉంది.ఇక తనకంటూ సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ తనని తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా వరకు ఇబ్బందులైతే ఎదుర్కొన్నాడు.
ఇక ఆయన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న తర్వాత వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఇక రీసెంట్ గా ఆయన ఈగల్( Eagle ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు.
ఇక దాంతో వరుసగా మూడు ఫ్లాప్ లను అందుకున్న రవితేజ ఇప్పుడు హరీష్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకొని ఆ తర్వాత విక్రమార్కుడు 2 సినిమా( Vikramarkudu 2 )ని కూడా పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాకి సంపత్ నంది( Director Sampath Nandi ) దర్శకత్వం వహించే అవకాశాలైతే ఉన్నాయంటూ ప్రొడ్యూసర్ కేకే రాధా మోహన్ ఇప్పటికే తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.అయితే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం విజయేంద్రప్రసాద్ పూర్తి చేశాడని తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే విక్రమార్కుడు సినిమాలో అనుష్క( Anushka ) తనదైన రీతిలో నటించి మెప్పించింది.మరి ఈ సినిమాలో రవితేజ పక్కన నటించే హీరోయిన్ ఎవరు అనే విషయాల పైన సరైన క్లారిటీ అయితే రావడం లేదు.
ఎందుకంటే ఈ సినిమాలో రవితేజ కి తగ్గట్టుగా హీరోయిన్ పాత్ర కూడా ఉండబోతుందట.అందు కోసమని హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలని ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి దీనికోసం ఎలాంటి హీరోయిన్ ను బరిలోకి దింపబోతున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని( Meenakshi Chaudhary ) హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి తననే తీసుకుంటారా లేదంటే ఇంకా వేరే హీరోయిన్ ను ఎవరైనా తీసుకుంటారా అనే విషయాలు తెలియాలంటే సినిమా యూనిట్ దీని పైన అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే…