ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో బ్రదర్స్ ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన "అర్జున్ రెడ్డి" చిత్రంలో హీరోగా నటించి ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిన టాలీవుడ్ రౌడీ "విజయ్ దేవరకొండ" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

 ఆ మధ్య విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సా ఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది. దీంతో ఎలాగైనా తన తదుపరి చిత్రం తో హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

అయితే తాజాగా విజయ్ దేవరకొండ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.  కాగాఈ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి దిగినట్లు తెలుస్తోంది.

దీంతో ఈ ఫోటోలని విజయ్ దేవరకొండ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే వైరల్ చేస్తున్నారు. అంతే గాక ఒకే ఫోటోలో "రెండు టైగర్లు" అంటూ రౌడీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ తెలుగులో "లైగర్" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ "అనన్య పాండే" నటిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉండడంతో విజయ్ దేవరకొండ "బాక్సింగ్ ప్లేయర్" గా కనిపించనున్నాడు.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పనులు ముంబై పరిసర ప్రాంతంలో జరుగుతున్నాయి.

 ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఆనంద్ దేవరకొండ విషయానికొస్తే ఆ మధ్య "మిడిల్ క్లాస్ మెలోడీస్" చిత్రం ద్వారా పర్వాలేదనిపించాడు.

కాగా ప్రస్తుతం "పుష్పకవిమానం" అనే మరో ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో సునీల్, సీనియర్ నటుడు నరేష్, కిరిటీ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది.

Advertisement

తాజా వార్తలు