మిస్ యూ మై సన్.. ప్రముఖ కమెడియన్ గీతా సింగ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు లేడీ కమెడియన్ గీతా సింగ్ ( Comedian Geeta Singh )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

గీతా సింగ్ అంటే చాలామందిని గుర్తుపట్టకపోవచ్చు కానీ కితకితలు హీరోయిన్ అంటే చాలా ఇష్టం గుర్తుపట్టేస్తారు.

అల్లరి నరేష్( Allari Naresh ) హీరోగా నటించిన కితకితలు సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకుంది గీతా సింగ్.ఇది ఇలా ఉంటే తాజాగా గీతా సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

గీతాసింగ్‌ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ ఘటనతో గీతా సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

Tollywood Comedian Geetha Singh Emotional About Her Son Loss, Tollywood, Geetha

సరిగ్గా రెండేళ్ల క్రితం చేతికి అందివచ్చిన కుమారుడిని కోల్పోయిన గీతాసింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైంది.ఫిబ్రవరి 18న తన కుమారుడి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించింది.తన కొడుకు తనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ మిస్ యూ రా అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది.

Advertisement
Tollywood Comedian Geetha Singh Emotional About Her Son Loss, Tollywood, Geetha

అయితే గీతాసింగ్‌ ఇప్పటివరకు అసలు పెళ్లి చేసుకోలేదు.తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పోషిస్తున్నారు.వారిలో పెద్దబ్బాయి రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

Tollywood Comedian Geetha Singh Emotional About Her Son Loss, Tollywood, Geetha

ఇకపోతే కితకితలు, ఎవడిగోల వాడిది సినిమాలో గీతా సింగ్‌ మంచి గుర్తింపు తెచ్చుకుంది.కమెడియన్‌ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా చిత్రాలు చేసింది.ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది.

అప్పుడప్పుడు షోలలో సందడి చేస్తూ ఉంటుంది.ఇకపోతే తాజాగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.

బీ స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు మళ్ళీ సినిమాలలోకి రావచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆ ఆలోచన వచ్చిన తొలి హీరో చిరంజీవి.. ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు