టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్స్ ని కొట్టడం లో వీరంతా ప్రముఖులు

ఇండస్ట్రీలో నటీనటులుగా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం చేస్తున్న యాక్టింగ్ అనేది అందరికీ నచ్చేలా ఉండాలి లేదంటే టేకుల మీద టేకులు తీసుకోవాల్సి ఉంటుంది అలా ఎక్కువ టేకులు తీసుకుంటే కొంత మంది డైరెక్టర్లకు నచ్చదు.

అలాంటప్పుడు ఆ డైరెక్టర్లు మృదుస్వభావి అయితే రిక్వెస్ట్ చేసి ఆర్టిస్టులతో యాక్టింగ్ చేయించుకుంటారు.

కానీ అందరూ దర్శకులు స్మూత్ గా ఉంటారని అని చెప్పలేం కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది.కొందరు టేక్ సరిగా రాకపోతే షూట్ అనుకున్న టైంకి కాకపోతే ప్రొడ్యూసర్ దగ్గర బ్యాడ్ నేమ్ వస్తుందని సెట్లోనే ఆర్టిస్ట్ ల మీద అరుస్తూ ఉంటారు.

షార్ట్ టెంపర్ ఉన్న డైరెక్టర్లలో కొంతమందిని చూద్దాం.ముందుగా కొత్తవాళ్లతో చిత్రం అనే సినిమా తీసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ తేజ ఇప్పటివరకు ఆయన పరిచయం చేసిన కొత్త ఆర్టిస్ట్ లను ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ పరిచయం చేయలేదు ఆయన ఏదైనా సినిమా స్టార్ట్ చేస్తున్నారు అంటే తప్పకుండా దాంట్లో ఎవరో ఒకరు కొత్తవాళ్లు ఉంటారు.

అలాంటి దర్శకుడు చిత్రం సినిమాతో ఇండస్ట్రీలో మంచి హిట్ కొట్టి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు.అయితే చిత్రం సినిమా షూటింగ్ అప్పుడు అందులో హీరోగా చేసిన ఉదయ్ కిరణ్ యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే అతని డైరెక్టర్ తేజ అతన్ని కొట్టాడని ఆ తర్వాతే అతను బాగా చేశాడని సినిమా హిట్ అయిన తర్వాత నవ్వుతూ ఇంటర్వ్యూల్లో చెప్పారు.

Advertisement

అయితే సినిమా హిట్ అయింది కాబట్టి ఆయన కొట్టిన పెద్దగా పట్టించుకోలేదు.ఆ తర్వాత తేజ ఉదయ్ కిరణ్ అనిత తో చేసిన నువ్వు నేను సినిమా లో హీరోయిన్ అనిత తేజ చెప్పినట్టుగా చేయకపోవడంతో ఆమెను కూడా తేజ కొట్టాడని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.

జయం సినిమాలో హీరోయిన్ సదా ని కూడా తేజ కొట్టారని చెప్పారు.కళ్యాణ్ రామ్ హీరోగా కాజల్ హీరోయిన్ గా తేజ డైరెక్షన్ లో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా లో కాజల్ సరిగా యాక్టింగ్ చేయలేదని తేజ తనని కొట్టాడు అని కాజల్ ఇప్పటికీ నవ్వుతూ చెబుతుంది.

తేజ ప్రతి సినిమాలో ఎవరినో ఒకరిని కొడుతూ ఉంటాడు అయితే తేజ ఎవరినైతే కొడతాడో వాళ్ళు మంచి హీరోలు హీరోయిన్స్ అవుతారని అందరూ అంటుంటారు అని తేజ నవ్వుతూ చెబుతూ ఉంటాడు.

తేజ పరిస్థితి ఇలా ఉంటే అప్పట్లో మోహన్ బాబు తో సినిమా చేసిన రవిరాజా పినిశెట్టి కూడా ఆర్టిస్టులను కొట్టే వాళ్లని చాలా మంది చెబుతుంటారు అయితే పెదరాయుడు సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు సీనియర్ నటి జయంతి గారిని మోహన్ బాబు గారు రవిరాజా పినిశెట్టి ఇద్దరు కలిసి కొట్టారని ఆ తర్వాత చాలాసార్లు చెప్పుకొచ్చారు.అలాగే రవిరాజా పినిశెట్టి మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన రాయుడు సినిమాలో కూడా కొత్తగా నటించిన ప్రత్యూష నీ కూడా అలాగే కొట్టారని మోహన్ బాబు రవిరాజా పినిశెట్టి నీ పిలిపించి అమ్మాయి యాక్టింగ్ సరిగా చేయకపోతే మాత్రం కొడతావా అని మోహన్ బాబు డైరెక్టర్ నీ తిట్టారని అప్పట్లో చాలా మంది చెప్పారు.ఇలా ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క విధానం ఉంటుంది కానీ సినిమాలలో సరిగ్గా చేయకపోతే కొట్టడం అనేది కరెక్ట్ విషయం కాదు ఎందుకంటే ఇప్పటివరకు డైరెక్టర్లు కొట్టిన ప్రతి ఆర్టిస్ట్ కొత్త వాళ్లే అదే ఒక సీనియర్ ఆర్టిస్టు సరిగా చేయకపోతే కొడతారా, లేదు అది ఒక పెద్ద హీరో కొడుకు ఆర్టిస్ట్ అయ్యాడు అతనిది ఫస్ట్ సినిమానే అతను యాక్టింగ్ సరిగా చేయలేదు అతన్ని కొడతారా, కొట్టారు కదా.ఇది సినిమా ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు చేతిలో దెబ్బలు తిన్న ఆర్టిస్టుల పరిస్థితి.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు