నేడే శివరాత్రి..లింగోద్భవ సమయం ఎప్పుడంటే?

శివుడు అభిషేక ప్రియుడు అనే విషయం అందరికీ తెలిసింది.

శివుడి అనుగ్రహం మనపై ఉండాలంటే శివుడికి మంచి నీటితో అభిషేకం చేసిన ఆయన కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.

అయితే స్వామివారికి శివరాత్రి రోజు ఇలా అభిషేకం అర్చనలు చేయడం వల్ల స్వామివారి ఎంతో ప్రీతి చెంది తన కరుణ కటాక్షాలను మనపై ఉంచడమే కాకుండా అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి.ఈ శివరాత్రి పండుగను ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

శివుడు లింగరూపంలోకి ఉద్భవించిన రోజున శివరాత్రి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఇక శివరాత్రి రోజు శివ లింగోద్భవసమయంలో స్వామివారికి ఈ విధమైనటువంటి అభిషేకాలు పూజలు చేయటం వల్ల రెట్టింపు ఫలితాలను పొందవచ్చు.

అయితే నేడు శివరాత్రి కావడంతో లింగోద్భవ సమయం ఎప్పుడు అనే విషయానికి వస్తే.లింగోద్భవ సమయం 01-03-2022 మంగళవారం రాత్రి తెల్లవారితే బుధ వారం రాత్రి 12 గంటల 29 నిమిషాల 4 సెకెండ్ల నుండి 12 గంటల 31 నిమిషాల 59 సెకెండ్ల పాటు లింగోద్భవ సమయం ఉంటుంది.

Today Is Shivratri When Is The Perfect Time Lingodbhava , Shivaratri , Lingodbha
Advertisement
Today Is Shivratri When Is The Perfect Time Lingodbhava , Shivaratri , Lingodbha

ఈ లింగోద్భవ సమయంలో భక్తులు స్వామి వారిని పూజించడం వల్ల స్వామివారి కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి.శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామస్మరణతో మారుమోగిపోతున్నాయి.శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు.

ఇప్పటికే ప్రతి శివాలయం భక్తులతో కిటకిటలాడుతున్నాయి.ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం.

వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి.

ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Advertisement

తాజా వార్తలు