Rajamouli : వందల కోట్లు సంపాదన… ఆ డబ్బుతో రాజమౌళి చేస్తున్న పనులు ఏంటో తెలుసా?

టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి( Rajamouli ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు రాజమౌళి.

కాగా ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా బాహుబలి లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు.

ఆర్ఆర్ ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి చూపులు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు రాజమౌళి.

ఈ ఒక్క మూవీతో ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు.అంతే కాకుండా రాజమౌళికి పరిశ్రమలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే పేరుంది.ఆయనకు సినిమానే ప్రపంచం.

Advertisement

హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే ఏకైక దర్శకుడు రాజమౌళినే.అంతేకాకుండా రాజమౌళి సినిమాకు కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే.

నిర్మాత కేవలం డబ్బులు ఖర్చు చేస్తాడు.మిగతా ఏరియాలపై కూడా ఆయనకు పట్టుంది.

కోరుకున్న అవుట్ ఫుట్ వచ్చే వరకు కాంప్రమైజ్ కాడు.ప్రేక్షకుడికి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని శాయశక్తులా కృషి చేస్తాడు.

సినిమా పూర్తయ్యాక ప్రొమోషన్స్, మార్కెట్ బిజినెస్ అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటాడు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, ఎంత బడా నిర్మాత అయినా రాజమౌళి చెప్పినట్లు వినాల్సిందే.ఆయన ఐడియాలు, ఆలోచనలు వంద శాతం సక్సెస్ అవుతాయి.అందుకే రాజమౌళి నిర్ణయాలకు ఎవరూ ఎదురు చెప్పరు.ఇక రాజమౌళి రెమ్యునరేషన్ సినిమాకు రూ.100 కోట్లకు పైమాటే.బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో రాజమౌళి భారీగా ఆర్జించారు.

Advertisement

రెండు దశాబ్దాలుగా రాజమౌళి తిరుగులేని దర్శకుడిగా ఉన్నాడు.వరుస విజయాలతో ఎవరికీ అందని స్థాయికి చేరాడు.

రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి హీరో, నిర్మాత కోరుకుంటారు.మరి రాజమౌళి సంపాదించిన డబ్బులు ఏం చేస్తారు? అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలగవచ్చు.

కాగా ఆయన తన సంపాదనలో అధిక భాగం రియల్ ఎస్టేట్, రెస్టారెంట్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెడుతున్నారు.స్థిరమైన ఆదాయం, ఆర్థిక భద్రత ఉండేలా చూసుకుంటున్నాడు.సినిమా అనేది జూదంతో సమానం.

ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.సక్సెస్ లేకపోతే ఎంతటివారినైనా పట్టించుకోరు.

అందుకే రాజమౌళి తన సంపాదన సినిమాల్లో కంటే ఎక్కువగా వ్యాపారాల్లో పెడుతున్నాడు.రాజమౌళి డబ్బులు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు.

కోట్ల సంపాదన ఉన్నా ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు చేస్తారు.డబ్బు చాలా విలువైనది.

దుబారా ఖర్చు చేయడం తగదని నమ్ముతాడు.పెద్దగా దాన ధర్మాలు చేయరు.

ఈ విషయంలో రాజమౌళి ఒకటి రెండు సందర్భాల్లో విమర్శల పాలయ్యారు.

తాజా వార్తలు