మీ జ్ఞాపకశక్తి తగ్గినట్టు అనిపిస్తుందా.. అయితే వెంటనే ఇలా చేయండి!

జ్ఞాపకశక్తి తగ్గినట్టు అనిపిస్తుందా.? చిన్న చిన్న విషయాలను కూడా మర‌చిపోతున్నారా.? అయితే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.

పొర‌పాటున దీనిని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఆల్జీమర్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధి బారిన పడే అవకాశాలు పెరుగుతాయి.

అందుకే జ్ఞాపక శక్తి తగ్గినట్లు అనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి.డైట్ లో మెదడు పనితీరును మెరుగుపరిచే ఆహారాలు చేర్చుకోవాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్‌ ను రెగ్యులర్ గా తీసుకుంటే మీ మెదడు పని తీరు అద్భుతంగా మెరుగుపడుతుంది.

జ్ఞాపక శక్తి తో పాటు ఆలోచన శక్తి సైతం రెట్టింపు అవుతుంది.మరి ఇంతకీ జ్ఞాపక శక్తిని పెంచే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా బ్లెండ‌ర్ తీసుకుని అందులో మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ) వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క( Cinnamon ) పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ వనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌, అరకప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

చివరిగా ఒక గ్లాసు హోమ్ మేడ్ బాదం పాలు పోసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.త‌ద్వారా మ‌న డ్రింక్ సిద్ధం అవుతుంది.

ఈ డ్రింక్ బ్రెయిన్ బూస్ట‌ర్ గా ప‌ని చేస్తుంది.

ఈ డ్రింక్ ను రోజుకు ఒక గ్లాస్ చొప్పున‌ ప్రతిరోజు తీసుకుంటే మెదడు పనితీరు అద్భుతంగా మెరుగుపడుతుంది.మెద‌డు మునుప‌టి కంటే వేగంగా, చురుగ్గా ప‌ని చేస్తుంది.జ్ఞాపక శక్తి తో పాటు ఆలోచన శక్తి రెట్టింపు అవుతుంది.

మ‌తిమ‌రుపు మీ ద‌రిదాపుల్లోకి రాదు.మెదడుకు సంబంధించిన ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

అంతేకాదు ఈ డ్రింక్ ను రోజు తీసుకుంటే శరీర బరువు అదుపులో ఉంటుంది.కంటి చూపు పెరుగుతుంది.బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.

Advertisement

ఎముకలు దృఢంగా మారతాయి.మోకాళ్ళ నొప్పులు ఉంటే దూరం అవుతాయి.

బాడీ రోజంతా సూపర్ ఎనర్జిటిక్ గా ఉంటుంది.క్యాన్సర్, మధుమేహం( Diabetes ) వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

మరియు చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా సైతం మెరుస్తుంది.

తాజా వార్తలు