కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుత హెయిర్ మాస్క్ ఇది.. డోంట్ మిస్!

జుట్టు( Hair ) అధికంగా ఊడిపోతుంది అంటే అందుకు కుదుళ్లు బలహీన పడటం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

అందుకే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ గా మార్చుకునేందుకు ప్రయత్నించాలి.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ న్యాచురల్ మాస్క్ కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.

మరి ఇంకెందుకు లేటు ఆ హెయిర్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకోవాలి.ఆ తర్వాత ఒక కప్పు వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్‌ తీసుకుని నానబెట్టుకున్న బియ్యం ను వాటర్ తో సహా వేసుకోవాలి.

Advertisement

అలాగే అరకప్పు ఫ్రెష్ కొబ్బరి ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ రైస్ మరియు కోకోనట్ జ్యూస్ లో నాలుగు స్పూన్లు అవిసె గింజల జెల్( Flax seeds Gel ) మరియు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్( Hair Mask ) ను వేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా బలహీనమైన జుట్టు కుదుళ్లు బ‌లంగా మారతాయి.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

కురులు సహజంగానే షైనీగా, సిల్కీగా త‌యార‌వుతాయి.డ్రై హెయిర్ సమస్య( Dry Hair Problem ) వేధించకుండా ఉంటుంది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

పైగా వారానికి ఒకసారి ఈ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు చిట్లడం సమస్య కూడా దూరం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు