ధన త్రయోదశి పండుగ రోజు ఈ వస్తువులను కొంటే ఆ ఇంటికి ధన లాభం ఉంటుందా...

దీపావళి పండుగను ప్రజలందరూ తమ ఇంటి ముందు దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని దీపాల వెలుగులో ప్రశాంతమైన వాతావరణంలో తమ ఇంటికి ఆహ్వానిస్తారు.

అలాంటి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు లభిస్తాయని వేద పండితులు చెబుతూ ఉంటారు.

దీపావళి పండుగ రెండు రోజుల ముందు ధన త్రయోదశి పండుగను చాలామంది ప్రజలు జరుపుకుంటారు.ఈ పండుగ మరో పేరే ధనతేరస్.

ధనతేరస్ రోజున కొన్ని వస్తువులను కొనటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు.లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు పొందే అవకాశం ఉంది.

ధనతేరస్ రోజున ఏ ఏ వస్తువులు కొనాలో ఇప్పుడు చూద్దాం.ధనతేరస్ రోజున బంగారం, వెండి, ఇత్తడి వంటి వస్తువులను కొనడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించి అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది.

Advertisement
Things To Buy On The Day Of Dhana Trayodashi Festival Details, Buy Things, Dhana

అలాగే ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం.ఇలా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది ఆ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు వస్తాయి.

ధన తేరస్ పండుగ రోజున చిగురు కొనడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు సంవత్సరం పాటు దూరమవుతాయి.

Things To Buy On The Day Of Dhana Trayodashi Festival Details, Buy Things, Dhana

దీపావళి అంటేనే దీపాల పండుగ కాబట్టి ఆ రోజు దీపాలు కొనుగోలు చేసి వాటిని వెలిగించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు.ధన తేరస్ రోజున 11 గోమతీ చక్రాన్ని కొని పసుపు గుడ్డలో కట్టి ఉంచితే సంవత్సరం పాటు ఆర్థిక సమస్యలు ఏవి రావు.అంతేకాక లక్ష్మీదేవికి ఇష్టమైన ధనతేరస్ రోజు ధనియాలు కొని అమ్మవారికి సమర్పించి పొలంలో నాటటం వల్ల ఏడాది పాటు ఇంట్లో ధన లాభం ఉంటుంది.

దీపావళి పండుగకు రెండు రోజుల ముందు ఇలాంటి వస్తువులు అన్నీ కొంటె ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు వస్తాయని వేద పండితులు చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Advertisement

తాజా వార్తలు