సోమావతి అమావాస్య రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు..!

సోమావతి అమావాస్య( Somavati Amavasya ) అంటే అమావాస్య సోమవారం రావడం వల్ల ఇలా పిలుస్తారు.

ఈరోజు రావి చెట్టు మూలంలో ఉన్న విష్ణుమూర్తి( Lord Vishnu Murthy )ని పూజిస్తారు.

మహిళలు 108 సార్లు రావిచెట్టుకు ప్రదక్షణ చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు.ఇలా చేస్తే జాతక దోషాలు దూరమైపోతాయని ప్రజలు నమ్ముతారు.

సూర్యుడు దక్షిణ యానం ప్రారంభించిన తర్వాత వచ్చిన మొదటి అమావాస్య ఇది.ఈ రోజు తప్పనిసరిగా సూర్యుడిని ఆరాధించాలి.సోమావతి అమావాస్య సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వస్తుంది.

హిందూ మత విశ్వాసాల ప్రకారం సోమావతి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Advertisement

ఈ రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం చేస్తారు.శివపార్వతులను( Lord shiva ) పూజిస్తారు.పితృదేవతలను కూడా భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటూ ఉంటారు.

అమావాస్య రోజున పితృదేవతలు వారి సంతానాన్ని ఆశీర్వదించడానికి భూలోకానికి వస్తారని చాలా మంది నమ్ముతారు.ఈ రోజు పితృ తర్పణం, పితృ కర్మలు చేయడం ఎంతో మంచిది.

అలాగే ఈ రోజు న శివుడిని పూజించడము, నీటిని దానం చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుంది.అలాగే ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, బ్రాహ్మణులకు ఆహార ధాన్యాలు దానం చేయడం, పాదరక్షకాలు గోడుగు, దుస్తులు మొదలైన వాటినీ దానం చేయడం ఎంతో మంచిది.

ఈ రోజున నల్ల నువ్వులు, బార్లీ గింజలు, పాలు, తామర పువ్వు కలిపి రావి చెట్టుకు పెట్టి ఓం నమో పితృభాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.ముఖ్యంగా చెప్పాలంటే సోమావతి అమావాస్య రోజు ఈ పనులను అస్సలు చేయకూడదు.సోమావతి అమావాస్య రోజు జుట్టు,గోర్లు కత్తిరించుకోకూడదు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
శరీరంలో ఇమ్యూనిటీ కోసమని వాటిని ఉపయోగిస్తున్నారా జాగ్రత్త సుమీ...!

మాంసము, మద్యానికి దూరంగా ఉండాలి.ఈ రోజున సొరకాయ, దోసకాయ, సెనగలు, జీలకర్ర, ఆవాలు, ఆకుకూరలు తినకూడదు.

Advertisement

ఎటువంటి శుభకార్యాలు మొదలు పెట్టకూడదు.ఈ రోజు వస్తువులు కొనడం మానుకోవాలి.

గొడవలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది.

తాజా వార్తలు