ప్రస్తుతం భారత జట్టులో ఉండే ఈ ఆటగాళ్లకు ఇదే ఆఖరి వరల్డ్ కప్ అవ్వనుందా..?

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచి విశ్వ విజేతగా నిలువాలని భావించిన భారత జట్టు కల, కల గానే మిగిలిపోయింది.

ఈ టోర్నీలో వరుస విజయాలతో ఫైనల్ చేరిన భారత్ టైటిల్ గెలవకపోవడంతో క్రికెట్ అభిమానులతో పాటు భారతీయులంతా బాధపడ్డారు.

ఈ సమయంలో మరొక దురదృష్టకరమైన విషయం క్రికెట్ అభిమానులను మరింత బాధపెడుతోంది.ఈ 2023 వరల్డ్ కప్( World Cup 2023 ) ఆడిన భారత జట్టులోని కొంత మంది ఆటగాళ్లకు ఇదే ఆఖరి వరల్డ్ కప్ అనిపిస్తోంది.2027 వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో బహుశా ప్రస్తుతం ఉండే కొంతమంది ఆటగాళ్లు ఉండకపోవచ్చు వారు ఎవరో చూద్దాం.

రోహిత్ శర్మ:

ఈ ఆటగాళ్లలో భారత జట్టు కెప్టెన్ కూడా ఉన్నాడు.కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) ప్రస్తుత వయసు 36 సంవత్సరాలు.2027 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మ వయసు 40 సంవత్సరాలు అవుతుంది.ఇప్పటికే రోహిత్ శర్మ ఫిట్నెస్ సమస్యలతో కాస్త బాధపడుతున్న సంగతి తెలిసిందే.

కాబట్టి 2027 వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో రోహిత్ శర్మ ఉండకపోవచ్చు.

విరాట్ కోహ్లీ:

విరాట్ కోహ్లీ( Virat Kohli ) వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు.భారత జట్టులో ఫుల్ ఫిట్నెస్ ఉండే ఆటగాళ్లలో కోహ్లీ కూడా ఒకడు.2027లో ఫుల్ ఫిట్నెస్ తో ఉంటే కచ్చితంగా భారత జట్టులో ఉండే అవకాశం ఉంది.పైగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులో నిలబడి ఒత్తిడిని తట్టుకొని పరుగులు రాబట్టే సత్తా ఉంది.

Advertisement

ఈ 2023 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు.

రవీంద్ర జడేజా:

భారత జట్టు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) వయసు 37 సంవత్సరాలు.రవీంద్ర జడేజా కూడా ఫిట్నెస్ సమస్యలతో కాస్త బాధపడుతున్నాడు.2027 వరకు ఫిట్ గా ఉంటాడని గ్యారెంటీగా చెప్పడం కష్టం.కాబట్టి 2027 వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో ఉండే అవకాశం చాలా తక్కువ.

మహమ్మద్ షమీ:

భారత జట్టు పేసర్ అయిన మహమ్మద్ షమీ( Mohammed Shami ) వయస్సు 33 సంవత్సరాలు.ప్రపంచ కప్ 2023లో అద్భుతమైన బౌలర్ గా రాణించాడు.ప్రపంచ కప్ 2027లో ఫిట్నెస్ గా ఉంటాడని చెప్పడం కష్టం.

రవిచంద్రన్ అశ్విన్:

భారత స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin ) వయస్సు 37 సంవత్సరాలు.వచ్చే వరల్డ్ కప్ కు ఇతని వయస్సు 41 సంవత్సరాలు అవుతుంది.కాబట్టి 2027 వరల్డ్ కప్ ఆడే జట్టులో కచ్చితంగా రవిచంద్రన్ అశ్విన్ ఉండే అవకాశం లేదు.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు