Alia Bhatt Sai Pallavi: జాతీయ ఉత్తమ నటి అవార్డు కి వీళ్ళు సరిపోరా ?

చాలా మంది సినిమాల్లో నటించేవారు తాము చేసిన పాత్రలకు ఎదో ఒక అవార్డు లభించాలని కోరుకుంటారు.

అవార్డులు మాత్రమే తమ సత్తాకు కొలమానం అని భావిస్తుంటారు కూడా.

అయితే రకరకాల అవార్డులు సినిమాలకు ఇస్తూ ఉంటారు.స్టేట్ మరియు సెంట్రల్ వారు ఇచ్చే అవార్డులు మాత్రమే కాకుండా కొన్ని సంస్థలు కూడా ప్రతిష్టాత్మకంగా అవార్డులను ప్రకటించి వారికి సన్మానాలు చేస్తుంటారు.

ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది.అయితే జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు( Best Actress Award ) అందుకోవాలంటే మంచి సినిమాలో అద్భుతమైన నటన కనబరిస్తే మాత్రమే సరిపోదు అంట.సెంట్రల్ లో దేశాన్ని పాలించే పార్టీ కి వ్యతిరేఖంగా ఎలాంటి కామెంట్స్ కూడా చేయకూడదు అంట.అలా ఇద్దరు నటీమణులు ఈ మధ్య కాలంలో వారు నటించిన సినిమాలతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అయ్యే ప్రదర్శన చేసిన కూడా వారు చేసిన కొన్ని కామెంట్స్ వాళ్ళ ఆ అవార్డు అందుకోవడం కుదరదు అంటూ చెప్తున్నారు కొంత మంది నెటిజన్స్.అందులో ముందుగా చెప్పుకోవాల్సిన నటి అలియా భట్.( Alia Bhatt ) గంగూబాయ్ కాఠియావాడీ సినిమాలో ఆమె ఎంతో చక్కగా నటించింది.అంతే కాదు ఆమెకు ఈ పాత్రకు గాను ఖచ్చితంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కుతుంది అని  చెప్తున్నారు.

These Are The National Best Actresses Alia Bhatt Sai Pallavi

కానీ ఒక వర్గం మాత్రం ఇందుకు బిన్నంగా అలియా కు ఆ అవార్డు వచ్చే అవకాశమే లేదు అంటుంది అందుకు గల కారణం ఆమె ఇటీవల బిజెపి పార్టీ పై కొన్ని వ్యాఖ్యానాలు చేయడమే అంటూ చెప్తున్నారు.ఆమె నిజంగా మాట్లాడిందా లేదా అది ఫేక్ న్యూసా అనే విషయం అయితే తెలియదు కానీ ఆమెకు అవార్డు వస్తుందో లేదో కొన్ని రోజులు వేచి చూస్తే తెలిసిపోతుంది.ఇక అలియా భట్ లాగానే అవార్డు కోల్పోబోతున్న మరో నటీమణి సాయి పల్లవి.

Advertisement
These Are The National Best Actresses Alia Bhatt Sai Pallavi-Alia Bhatt Sai Pal

( Sai Pallavi ) ఆమె విరాటపర్వం సినిమాలో చాల చక్కగా నటించింది కానీ ఆమెకు కూడా అవార్డు వచ్చే అవకాశమే లేదు అంటూ కొందరు, క్లైమాక్స్‌లో తన నటన చూస్తే ఖచ్చితంగా ఇస్తారు అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

These Are The National Best Actresses Alia Bhatt Sai Pallavi

అవార్డు రాకపోవడానికి కారణంగా ఆమె కూడా సదరు పార్టీ పై ఏదో వ్యతిరేకంగా మాట్లాడిందంట కదా అని అంటున్నారు.ఇదంతా కాదు వేశ్య పాత్రా చేసిన అలియా కు, నక్షలైట్ పాత్రా చేసిన సాయి పల్లవి కి అవార్డు రాదు అని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం మౌసమ్ లో షర్మిల వేశ్య పాత్రలో చేసింది.ఆమెకు అవార్డు దక్కింది.

ఒసేయ్ రాములమ్మ లో విజయశాంతి లాస్ట్ రౌండ్ వరకు వెళ్లి అవార్డు కాస్తలో కోల్పోయింది అని అంటున్నారు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు