డైరెక్టర్లు అద్బుతంగా డిజైన్ చేసిన హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ ఇవే..?

ఒక డైరెక్టర్ ఒక సినిమా తీస్తున్నాడు అంటే దానికి సంభందించిన కథ కథనం ఎలా ఉంది అనే విషయం మీద ఎక్కువ ఫోకస్ పెడ్తాడు ఎందుకంటే ఏది ఎలా ఉన్న పర్లేదు కానీ కథ కథనం మాత్రం బాగుండాలి అది సరిగ్గా లేకపోతే సినిమా మీద ఎంత ఎఫర్ట్ పెట్టిన అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుందే తప్ప సక్సెస్ మాత్రం కాదు అనే చెప్పాలి.

అందుకే డైరెక్టర్ అనేవాడు మొత్తం సినిమాకి సంభందించిన వర్క్ అంత ముందే ప్లాన్ ప్రకారం కంప్లిట్ చేసి ఆ తర్వాత షూట్ చేస్తారు.

అయితే సినిమాల్లో కొన్ని ఎలివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాటి వల్లే ప్రేక్షకుడు ఎక్కువ థ్రిల్ ఫీల్ అవుతుంటాడు అందుకే చాలా కమర్షియల్ సినిమాల్లో హీరోల ఇంట్రడక్షన్స్ వావ్ అనిపించేలా డిజైన్ చేస్తారు ఏ సినిమాలో హీరో ఇంట్రాడక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం.

చిరుత

These Are The Best Hero Introduction Scenes Chirutha Yogi Gabbar Singh Details,

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ చరణ్ ని హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ తీసిన సినిమానే చిరుత.ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ ని పూరి జగన్నాథ్ చాలా అద్భుతంగా తీసారనే చెప్పాలి.జైలు లో ఒక్కడు హీరో తో గొడవ పెట్టుకుంటే వాణ్ణి కొట్టే ప్రాసెస్ లో మొహానికి గుడ్డ పేగు కట్టుకుంటాడు దాన్ని రౌడీ పట్టుకొని లాగడం తో హీరో పేస్ రివీల్ అవుతుంది.

ఈ సీన్ థియేటర్ లో చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.

యోగి

These Are The Best Hero Introduction Scenes Chirutha Yogi Gabbar Singh Details,
Advertisement
These Are The Best Hero Introduction Scenes Chirutha Yogi Gabbar Singh Details,

ప్రభాస్ హీరోగా వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన యోగి సినిమాలో జైలు లో ప్రభాస్ ఉంటె సిటీ లో ఉన్న గుండాలందరు వచ్చి ఆయన్ని చూసి నా పేరు గుర్తుపెట్టుకో అన్న అని వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు అక్కడ జరిగే చిన్న ఫైట్ సీన్ లో హీరో ఇంట్రడక్షన్ వస్తుంది.

గబ్బర్ సింగ్

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో కొంతమంది రౌడీలు బ్యాంకు రాబరీ చేసుకొని వెళ్తుంటే హీరో గుర్రం మీద వచ్చి వాళ్ళని పట్టుకొని మనీ రికవరీ చేస్తాడు.

Advertisement

తాజా వార్తలు