ఖమ్మం మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

పట్టణంలోని ఏసీపీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం వరకు రోడ్డును వెడల్పు చేయాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించేందుకు ప్రయత్నించారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు మహ్మద్ జావిద్ తో పాటు ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు