సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ హీరోయిన్ల హవా.. మామూలుగా లేదుగా!

సినిమా ఇండస్ట్రీలో తమ అందం,అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆ హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం మనుగడ సాధించలేరు.

అందుకే అవకాశం ఉన్నప్పుడే హీరోయిన్లు పెద్ద ఎత్తున సినిమాల్లో నటిస్తూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటారు.

ఇక ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఫేడ్ అవుట్ అయ్యే దశకు వచ్చారు అంటే వారికి అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా కొందరు ఇండస్ట్రీకి దూరమవుతారు.ఈ విధంగా ఇండస్ట్రీ నుంచి దూరమైన ఎంతో మంది హీరోయిన్లు వారి వైవాహిక జీవితంలో స్థిరపడి కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఉండగా మరి కొందరు వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ వ్యాపారరంగంలో కొనసాగుతూ ఉంటారు.

అదే విధంగా మరి కొంత మంది హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వారి వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ నటుడు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలకు ఫస్ట్ ఆప్షన్ గా ఉన్నటువంటి పలువురు హీరోయిన్స్ ప్రస్తుతం సెకండ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

అలాంటి వారిలో సిమ్రాన్, భూమిక, ప్రియమణి వంటి హీరోయిన్స్ ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అక్క వదిన పాత్రలో నటించడమే కాకుండా తల్లి పాత్రలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అలాగే బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేణుదేశాయ్ చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ సరసన నటించిన మీరా జాస్మిన్ నాలుగు పదుల వయసులో సినిమా అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

వీరితో పాటు సీనియర్ హీరోయిన్స్ ఆమనీ, ఇంద్రజ, రమ్యకృష్ణ, రాశి, అమల వంటి నటీమణులు సైతం ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలకు తల్లి పాత్రల ద్వారా మరోసారి ఇండస్ట్రీలో కొనసాగుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ సీనియర్ హీరోయిన్ల హవా ఇండస్ట్రీలో భారీగా కొనసాగుతోంది.ఒకప్పుడు హీరోయిన్లుగా ఎలా అయితే పోటీ పడ్డారో ఇప్పుడు కూడా ఈ తారల మధ్య గట్టి పోటీ ఉంది.

వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?
Advertisement

తాజా వార్తలు