వైరల్ : కౌన్ బనేగా కరోడ్ పతి షోలో PNR అంటే ఏంటో చెప్పలేకపోయిన టిటిఈ...PNR అంటే మీకు తెలుసా..

పిఎన్ఆర్ నంబర్.అనేది వినగానే రైల్వేకి సంభందించింది అని టక్కున చెప్పేస్తాం.

కానీ పూర్తి రూపం ఏంటి అనేది ఎఫ్పుడైనా తెలుసుకున్నారా.

మనం నిత్యం ఉపయోగించే పదాలే తెలుసుకోకపోతే అప్పుడప్పుడు కష్టమే మరి.మనకు తెలియదంటే ఒక అర్దం ఉంది.కానీ సాక్ష్యాత్తు రైల్వే టిటిఇ గా పని చేస్తున్న వ్యక్తి కి కూడా తెలియకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇటీవల కౌన్ బనేగా కరోడ్ పతి షోలో వచ్చిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక మూడు లక్షల రూపాయలను వదిలేసుకున్నాడు ఒక టిటిఇ.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్‌బనేగా కరోడ్ పతి సీజన్ 10 ప్రారంభమైంది.రెండో ఎపిసోడ్‌లో భాగంగా హాట్‌సీట్‌లో బీహార్‌కు చెందిన సోమేష్ అనే వ్యక్తి కూర్చున్నాడు.సోమేష్‌ రైల్వేలో టికెట్ ఎగ్జామినర్‌గా పని చేస్తున్నారు.

Advertisement

ఇక ఆట మొదలైంది.అమితాబ్ బచ్చన్ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు.

సోమేష్ టకటకా జవాబు చెబుతున్నాడు.అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ వస్తున్న సోమేష్ ఒక్క ప్రశ్న దగ్గర టక్కున ఆగిపోయాడు.

ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే.రైల్వేలో పీఎన్ఆర్ కు పూర్తి రూపం ఏమిటి.? ఇక్కడ అమితాబ్ అడిగిన ప్రశ్నకు సోమేష్ బిక్కమొహం వేశాడు.పోనీ ప్రశ్న కూడా ఎక్కడి నుంచో వెతికి వేయలేదు.

సోమేష్ పనిచేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నే.అయినప్పటికి సమాధానం చెప్పలేక నాలుగు లైఫ్ లైన్లలో మూడు లైఫ్ లైన్లు వినియోగించుకున్నడు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

సమాధానం చెప్పలేక అప్పటివరకు గెలుచుకున్న మూడు లక్షల ఇరవై వేల రూపాయలు వదులుకున్నాడు.

Advertisement

PNR (passenger name record)కు పూర్తి రూపం ఏమిటి అడగ్గానే సోమేష్ చాలాసేపు ఆలోచించాడు.రైల్వేలో టీటీఈగా పనిచేస్తున్న సోమేష్‌కు జవాబు తెలియకపోవడంతో అక్కడ కూర్చున్న వారు షాక్ అయ్యారు.సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ చూసిన నెటిజన్లు టిటిఈకి పిఎన్ఆర్ నంబర్ అంటే ఏంటి తెలియదా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

తాజా వార్తలు