ఫైమా రెమ్యూనరేషన్ పై ఓపెన్ అయిన తల్లి.. ఏం చెప్పారంటే?

పటాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఫైమా.

ఈ కార్యక్రమంలో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు.

ఇక జబర్దస్త్ కార్యక్రమంలో ఈమెకు విపరీతమైన అభిమానులు పెరిగిపోయారని చెప్పాలి.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూనే మరోవైపు యూట్యూబ్ వీడియోలు చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఈ విధంగా సోషల్ మీడియాలో పైమాకు ఎంతోమంది అభిమానులు ఉండడంతో ఈమెకు ఏకంగా బిగ్ బాస్ అవకాశం కూడా వచ్చింది.ప్రస్తుతం ఫైమా బిగ్ బాస్ హౌస్లో తనదైన శైలిలో సందడి చేస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఫైమా కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె తల్లి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ విధంగా ఫైమా తల్లి మాట్లాడుతూ తన కూతురు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Advertisement
The Mother Who Opened Up On Faima Remuneration What Did She Say Faima Mother,re

మేము వద్దన్నా బలవంతంగా తాను ఈ రంగంలోకి వచ్చిందని అయితే ఈ రంగంలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడమే కాకుండా మాకు ఎంతో గర్వకారణంగా నిలిచిందని తెలిపారు.

The Mother Who Opened Up On Faima Remuneration What Did She Say Faima Mother,re

ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఫైమా సంపాదన గురించి కూడా తన తల్లికి ప్రశ్నలు ఎదురయ్యాయి.యూట్యూబ్ ద్వారా జబర్దస్త్ ద్వారా ఫైమా ఎంత సంపాదిస్తుందని అందరూ భావిస్తున్నారు.అయితే ఇదే ప్రశ్న తన తల్లికి ఎదురవగా.

ఈమె చెప్పిన సమాధానం విని అందరు షాక్ అయ్యారు.ఈ సందర్భంగా ఆమె తన కూతురి సంపాదన గురించి మాట్లాడుతూ మగపిల్లాడైతే ఎంత సంపాదిస్తున్నావురా అని నిడదీయవచ్చు.

ఆడపిల్లని అలా అడగలేము కదా అంటూ సమాధానం చెప్పారు.ఇక ఈమె తన రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడూ అడగలేదని తన తోడబుట్టిన వాళ్ళ బాగోగులు ఇంటి ఖర్చులను కుటుంబ పోషణను మొత్తం తన కూతురే చూసుకుంటుంది అంటూ ఎంతో గర్వంగా తెలియజేశారు.

ఇంత స్లిమ్‌గా, యంగ్‌గా ఉన్న ఈ చైనీస్ మహిళ ఓ అమ్మమ్మ అట.. వయసు తెలిసి నెటిజన్లు షాక్!
Advertisement

తాజా వార్తలు