LOLకి మీరనుకొనే మీనింగ్ వేరు, ఇండియన్ రైల్వేస్ ఇచ్చిన నిర్వచనం వేరు.. ఎందుకలా?

LOL అనే పదం తెలియని యువత బహుశా ఉండరనే చెప్పుకోవాలి.వాట్సాప్, ఈ మెయిల్ లో ఈ పదం విరివిగా వాడుతున్నారు.

సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఉపయోగించే LOL అనే పదానికి అర్ధం అందరికి తెలిసిందే. LOL అంటే నవ్వును వ్యక్త పరచడం అని అర్ధం.

ఒక వ్యక్తి నవ్వుతున్నాడు లేదా హాస్యాస్పద సన్నివేశానికి సంకేతంగా ఈ పదాన్ని వాడతారు.అయితే భారతీయ రైల్వేలో ఈ పదం అర్థం వేరే వుంది.

LOL అంటే ప్రాణ నష్టమని రైల్వే శాఖ చెబుతోంది.పశ్చిమ రైల్వే జోన్ తాజాగా చేసిన ట్వీటే దీనికి నిదర్శనం.

Advertisement
The Meaning You Want To Lol Is Different The Definition Given By Indian Railway

అసలు పశ్చిమ రైల్వే ఏం ట్వీట్ చేసిందో చూడండి.రైల్వే ట్రాక్ లను దాటడం వల్ల కలిగే ప్రమాదం గురించి పశ్చిమ రైల్వే ట్వీట్ చేసింది.

అయితే LOL అనే పదం ఉన్న ఫోటోను ట్వీట్ చేస్తూ ప్రమాదం గురించి వివరించింది.ఇమేజ్ లోని L అంటే లాస్, O అంటే ఆఫ్, L అంటే లైఫ్.

మొత్తంగా LOL అంటే లాస్ ఆఫ్ లైఫ్ అని పశ్చిమ రైల్వే వివరిస్తూ ట్వీట్ చేసింది.‘మీ జీవితం ఎంతో విలువైనది.

రైల్వే ట్రాక్ లను అతిక్రమించి మీ ప్రాణాలకు హాని తెచ్చుకోవద్దు.ప్రయాణీకులందరూ ఈ విషయంపై జాగ్రత్త వహించాలి’ అని రైల్వే విభాగం చెబుతోంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
డ్రోన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు.. పెళ్లిలో ఊహించని సీన్.. వీడియో చూస్తే నవ్వాగదు..

ఒక ప్లాట్ ఫారమ్ నుండి మరో ప్లాట్ ఫారమ్ కు వెళ్లడానికి సరైన మార్గాలను ఎంచుకోవాలి తప్ప, అడ్డదారిలో వెళ్లకూడదని హెచ్చరించింది.

The Meaning You Want To Lol Is Different The Definition Given By Indian Railway
Advertisement

అయితే ఈ చిత్రంలో హెచ్చరిక కూడా రాసింది.రైల్వే చట్టంలోని సెక్షన్ 147 ప్రకారం నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు అని తెలిపింది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూర్ 2021 అక్టోబర్ లో రైలు ప్రమాదాలపై నివేదిక విడుదల చేసింది.2020లో దేశవ్యాప్తంగా 13,000 కంటే ఎక్కువ రైలు ప్రమాదాలు జరిగాయని తెల్చింది.ఈ ప్రమాదాల్లో 12,000 మంది ప్రయాణికులు చనిపోయినట్లు నివేదికలో పేర్కొంది.

అయితే, ఎన్ సీఆర్ బి నివేదిక కూడా 13,018 ప్రమాదాలు జరిగాయని తెలిపింది.ఈ ప్రమాదాలు ఎక్కువగా రైలు నుండి పడిపోవడం లేదా ట్రాక్ దాటుతున్నప్పుడు జరిగిన ప్రమాదాలే అని నివేదికలో పేర్కోవడం దురదృష్టకరం.

తాజా వార్తలు