మహానేత వైఎస్ కోల్పోవడం దేశానికి తీరని లోటు

వైఎస్ ఆలోచనలు అత్యంత ప్రజాస్వామికంగా ఉండేవి సామాజిక స్పృహా, అభివృద్ధి కాంక్షతో ఎదిగిన మహానాయకుడు వైఎస్ఆర్ అర్ధాంతరంగా మరణించండం సమాజానికి అతి పెద్ద నష్టం వైఎస్ఆర్‌ వర్ధంతి కార్యాక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డిని కోల్పోవడం ఈ దేశానికి తీరని లోటు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.వైఎస్ఆర్ ఆలోచనలు అత్యంత ప్రజాస్వామికంగా ఉండేవన్నారు.

 The Loss Of The Great Leader Ys Is A Huge Loss For The Country , Clp Leader Bhat-TeluguStop.com

శుక్రవారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి కార్యాక్రమాన్ని డిసిసి కమిటి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్య అతిధిగా హాజరై డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళీలు అర్పించారు.ఆనంతరం ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో ఆయన మాట్లాడారు.వైఎస్ఆర్ ఆలోచనలు, నడవడిక, భాషా రాజాకీయాల్లో ఉండాలని అనుకునేవారికి, పార్టీలకు నాయకత్వం వహించాలని అనుకునేవారికి తపనిసరిగా మార్గదర్శకంగా ఉంటాయన్నారు.

రాజాకీయాలు అంటే కేవలం దూషణలు, ఆసభ్యపదజాలంతో మాట్లాడటం కాదన్నారు.సైద్దాంతికంగా నిబద్ధతతో నమ్మిన విషయాలను స్పష్టంగా ప్రజలకు వివరించడమే కాకుండా వారిని మెప్పించి, ఒప్పించి ప్రజల హృదయాలను గెలుచుకొని సుస్థిరస్థానం సంపాదించుకోవడం డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేర్చుకోవచ్చన్నారు.సామాజిక స్పృహాతో.

అభివృద్ధి కాంక్షతో.ఎదిగిన మహానాయకుడు అర్ధాంతరంగా మరణించండం ఈసమాజానికి జరిగినటువంటి అతి పెద్ద నష్టమన్నారు.

అత్యంత రాజకీయ పరిపక్వతతో కాంగ్రెస్‌ పార్టీ మూలసిద్దాంతాలతో ఎదిగిన డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం రాష్ట్రానికే కాకుండా, దేశానికి కూడా ఒక దశ, దిశ, నిర్దేశం చేసే నాయకుడిగా ఉండేవారని కొనియాడారు.డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ దేశానికి మార్గదర్శనం చూయించే నాయకుడిని కోల్పోయినట్టుగా అయ్యిందని ఆవేధన చెందారు.వ్యవసాయం, సంక్షేమం, విద్య, వైద్యం సాంకేతిక పరమైనటువంటి విషయాల్లో చాల ముందు చూపు కలిగి సుదీర్ఘ అవగాహన కలిగిన నాయకుడిని కోల్పోవడం వల్ల ప్రజలకు తీరని నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube