రేవంత్ కు ఛాన్స్ ఇచ్చిన టీఆర్ఎస్ ! ఇక ఊరుకుంటాడా ? 

జనాల ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనే విషయాలపై క్లారిటీ లేకపోతే ఎవరి మెప్పు అయితే పొందాలనుకుంటున్నారో వారు ముందే అభాసుపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

రాజకీయాల్లో ఉన్నవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

కానీ తెలంగాణ అధికార పార్టీ నాయకులు కొంతమంది ఫ్లో లో నోరు జారిన అంశాలే ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిపోయాయి.ఇప్పటికీ తెలంగాణలో పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్న నిరుద్యోగుల ఆత్మహత్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి చులకనగా  మాట్లాడారు.

తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని, 50 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ గత ఆరు నెలలుగా టిఆర్ఎస్ ప్రకటనలు చేస్తూ వస్తోంది.కానీ అది కార్యరూపం దాల్చడం లేదు.

ఈ విషయంపై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉన్న విషయాన్ని కేటీఆర్ కూడా ఒప్పుకోవడం ఇప్పుడు కాంగ్రెస్ కు వరంగా మారింది.

Advertisement
The Hasty Actions Of The Trs Leaders Turned Out To Be In Favor Of Rewanth Reddy

ఇటీవల మీడియా సమావేశం సందర్భంగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో ప్రతిపక్షాలకు నిరుద్యోగం గురించి తప్ప వేరే అంశం గురించి మాట్లాడేందుకు సబ్జెక్టే లేదు అంటూ చెప్పడం,  తెలంగాణ లో నిరుద్యోగ సమస్య ఉందనే విషయాన్ని ఆయన ఒప్పుకున్నట్లు అయింది.

ఇటీవలే తలసాని శ్రీనివాస్ యాదవ్,  మంత్రి గంగుల కమలాకర్ గుట్కా వివాదంలో చిక్కుకున్నారు.మరో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ హమాలి పని కూడా ఉద్యోగమే అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

The Hasty Actions Of The Trs Leaders Turned Out To Be In Favor Of Rewanth Reddy

తెలంగాణలో తాము బలపడేందుకు నిరుద్యోగ సమస్య బాగా ఉపయోగపడుతుందని , యువతుకు దగ్గర అయ్యేందుకు ఈ అంశాన్ని హైలెట్ చేసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఈ అంశంపై తెలంగాణ అంతటా ఉద్ధృతంగా పర్యటనలు చేపట్టి,  నిరుద్యోగుల మద్దతు కూడగట్టి ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధమవుతోంది.అలాగే రాష్ట్రవ్యాప్తంగా 48 గంటల పాటు నిరాహార దీక్ష చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ వ్యవహారాలన్నీ అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి.ఇవే ఇప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ కు ఆయుధాలుగా మారిపోయాయి.

ప్రభాస్ సలార్ 2 సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా..?
Advertisement

తాజా వార్తలు