పెరుగుతున్న గోదావరి నీటి ప్రవాహం.అప్రమత్తమైన అధికారులు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుంది.దీంతో అధికారులు అప్రమత్తమై మిగులు జలాలను ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి సముద్రంలో కి విడిచి పెడుతున్నారు.
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే గోదావరి నీటి ప్రవాహం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది.
బ్యారేజ్ లో శనివారం సాయంత్రం 6 గంటలకు 8.45 అడుగుల నీటిమట్టం నమోదైంది.బ్యారేజ్ 54 గేట్ల ద్వారా లక్షా ఆరు వందల పద్నాలుగు ( 1,51,614) క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
గోదావరి నదిలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా సాగునీటి అవసరాల కోసం పది వేల (10,000) క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
రాజమహేంద్రవరం పాత బ్రిడ్జి వద్ద 13.260 మీటర్లు, పోలవరం వద్ద 7.240 మీటర్లు, భద్రాచలం వద్ద 16.90 అడుగుల నీటిమట్టం నమోదయింది.కాటన్ బ్యారేజి నుంచి శుక్రవారం 1.37 లక్ష క్యూసెక్కులు సముద్రంలోకి, 8,200 క్యూసెక్కులు కాలువకు, గురువారం 1.03 లక్షల క్యూసెక్కుల సముద్రంలోకి, 7,200 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేశారు.గత రెండు రోజుల కంటే శనివారం గోదావరిలో నీటి ప్రవాహం పెరిగింది.