గుడ్ న్యూస్: ఇకపై ఒలింపిక్స్‌ లో క్రికెట్.. అభిమానులకు పండగే..!

భారతదేశంలో క్రికెట్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అంటే ఇండియానే ఫేమస్.

ఇక ఐపిఎల్ వస్తే చాలు అన్ని దేశాలు ఇటువైపు చూస్తుంటాయి.అందుకే క్రికెట్ కు ఇండియాలో అద్భుతమైన క్రేజ్ ఉంది.

ఒక వేళ ఇండియా, పాకిస్థాన్ కు క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది అంటే అదేదో పెద్ద యుద్దమే జరుగుతోంది అన్నట్టుగా అందరూ వెయ్యి కళ్లతో మ్యాచ్ ను చూస్తారు.మరి అలాంటి క్రికెట్ ఆట ఒలింపిక్స్ లో ఎందుకు చేర్చడం లేదో చాలా మందికి తెలీదు.

అందరికీ తెలియని విషయం ఏంటంటే ఒలింపిక్స్ లో ఇది వరకూ క్రికెట్ ఉండేది.అయితే ఆ తర్వాత దానిని తొలగించారు.

Advertisement

ఒలింపిక్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గేమ్స్.అందులో అనేక మంది క్రీడాకారులు పాల్గోని తమ సత్తాను చాటుతుంటారు.ఇందులో తాజాగా భారత అథ్లెట్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు.

అయితే ఒలింపిక్స్ లో క్రికెట్ మాత్రం లేదు.ఎప్పటి నుంచో ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చాలని చాలా మంది పోరాడుతున్నారు.1900వ సంవత్సరం పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ కూడా ఒలింపిక్స్ లో ఉండేది.ఆ తర్వాత దానిని కొనసాగించలేదు.

ఇప్పుడు బీసీసీఐ క్రికెట్ అభిమానులకు ఓ తీపికబురు చెప్పింది.

ఒలింపిక్స్ లో క్రికెట్ ను ఎప్పుడు చేరుస్తారోనని ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.బీసీసీఐతో కలిసి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ) ఇది వరకూ చాలాసార్లు చర్చలు జరిపింది.ఆ టైంలో బీసీసీఐ ఒప్పుకోకపోవడంతో అది సాధ్యపడలేదు.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??

అయితే 2028వ సంవత్సరం లాస్‌ ఏంజెల్స్‌లో నిర్వహించే ఒలింపిక్స్‌లో మాత్రం క్రికెట్‌ ఆట ఉండనున్నట్లు తెలుస్తోంది. 8 జట్ల మధ్య టీ 20 లేదా టీ 10లు ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

అదే జరిగితే క్రికెట్ అభిమానులకు ఇక పండగే ఉంటుంది.ఇండియాకు క్రికెట్ లో పతకం రావడం ఖాయం అవుతుంది.

తాజా వార్తలు