SS Rajamouli : స్టోరీ రివీల్ చేసి హిట్ కొట్టే సత్తా ఉన్న దర్శకుడు జక్కన్న మాత్రమేనా.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి.

ఇప్పటి వరకు జక్కన్న 12 సినిమాలను తెరకెక్కించగా ఆ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.అంతేకాకుండా ఒకదానిని మించి ఒకటి సినిమాలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.

కాగా రాజమౌళి చివరగా ఆర్ఆర్ఆర్ కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల భారీగా కలెక్షన్స్ ను సాధించి రికార్డుల మోత మోగించింది.

ఇకపోతే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో( Mahesh Babu ) తెరకెక్కించబోయే సినిమాలకు సంబంధించిన పనులను చూసుకుంటూ బిజీబిజీగా ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రాజమౌళికి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది.అయితే రాజమౌళికి ఒక అలవాటు ఉందట.

Advertisement

సినిమాకు సంబంధించిన కొన్ని పాయింట్స్ ముందుగానే చెప్పేస్తారు.ముఖ్యంగా కొన్ని సినిమాలకు అసలు కథ ముందుగానే మీడియాకి చెప్పేస్తాడు.

కొత్తగా ఎలాంటి ఊహాగానాలకి తావు ఇవ్వకుండా సినిమాలో తాను ఎలాంటి కథని చెప్పాలని అనుకుంటున్న అనేది రివీల్ చేసేస్తాడు.ఆ కథని తన మేకింగ్, టేకింగ్ తో ఆడియన్స్ ని ఎలా మెప్పించాలో అనేది మాత్రమే సినిమాలో హైలెట్ చేస్తాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా( RRR movie ) అసలు స్టోరీ ఏంటి అనేది ముందే చెప్పేసి మరీ సూపర్ హిట్ కొట్టాడు.అలాగే రాజమౌళికి స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత చేసిన చిన్న సినిమా అంటే మర్యాద రామన్న అని చెప్పాలి.మగధీర సినిమా తరువాతే ఇది వచ్చింది.

సునీల్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇతర భాషలలో కూడా రీమేక్ అయ్యింది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఈ సినిమా రిలీజ్ కి ముందే జక్కన్న స్టోరీ మొత్తం మీడియాకి చెప్పేశాడు.తన ప్రత్యర్థి కొడుకుని చంపేయాలని పల్లెటూరిలో విలన్ వెయిట్ చేస్తూ ఉంటాడు.

Advertisement

నిజానికి అతను అతిథిని దేవుడిలా చూసుకునే వ్యక్తి, ఇంట్లో రక్తం చిందకూడదని ఆచారాన్ని నమ్ముతాడు.హీరోకి ఆ ఊళ్ళో పొలం అమ్ముకుంటే డబ్బులు వస్తాయని వెళ్లి అనుకోకుండా తనని చంపాలని అనుకుంటున్న విలన్ ఇంటికి అతిథిగా వెళ్తాడు.

అతిథిగా వచ్చిన హీరోని విలన్ చాలా అద్భుతంగా చూసుకుంటాడు.సడెన్ గా హీరో తన ప్రత్యర్థి కొడుకు అని విలన్ కి తెలుస్తుంది.

గుమ్మం లోపల ఉన్నంత వరకు అతిథిగా చూడాలి.గుమ్మం దాటి బయటకి వెళ్లిన వెంటనే చంపేద్దాం అని విలన్ డిసైడ్ అవుతాడు.

ఇలా ఈ సినిమా కథను ముందుగానే రివిల్ చేశారు దర్శకుడు రాజమౌళి.

తాజా వార్తలు