పెండ్లి వేదిక‌పై వ‌రుడికు చుక్క‌లు చూపిస్తున్న వ‌ధువు.. వీడియో వైర‌ల్‌

పెండ్లి అంటే ఒక‌ప్పుడు ఒక‌లా, ఇప్పుడు మ‌రొక‌లా ఉంటున్నాయి.ఒక‌ప్పుడు పెండ్లి అంటే చాలా సింపుల్ గా జ‌రిగేవి.

కానీ ఇప్పుడు పెండ్లి వేడుక‌ల్లోకి కొత్త కొత్త ఫ్యాష‌న్‌లు పుట్టుకొచ్చాయి.చాలా ట్రెండింగ్ అంశాలు చొచ్చుకొచ్చాయి.

దీంతో పెండ్లిలో అనేక ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి.ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో నిత్యం ప్ర‌త్య‌క్షం అవుతున్నాయి.

ఒక‌ప్పుడు వ‌ధువు అంటే సిగ్గు ప‌డుతూ తాళి క‌ట్టించుకోవ‌డం అనేలా ఉండేది.కానీ ఇప్పుడు మాత్రం చ‌లాకీగా త‌మ పెండ్లిలో గ‌డుపుతున్నారు న‌వ వ‌ధువులు.

Advertisement

ఇలా న‌వ వ‌ధువులు చేస్తున్న కొన్ని చిలిపి, అల్ల‌రి ప‌నులు నెట్టింట్లో ఎంత‌లా వైర‌ల్ అవుతున్నాయో అద‌రికీ తెలిసిందే.ముఖ్యంగా దండలు మార్చుకునే సంద‌ర్భంలో అయితే పెండ్లి వేదిక‌పై వ‌రుడికి అంద‌కుండా వెన‌క్కు జ‌ర‌గ‌డ‌మో లేదంటే త‌ప్పించుకోవ‌డమో ఏదో ఒక‌టి చేస్తున్నారు.

ఇప్ప‌డు కూడా ఓ వ‌ధువు ఇలాగే చేసి వ‌రుడికి చుక్క‌లు చూపించింద‌నుకోండి.ఎందుకంటే వ‌రుడుకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వ‌కుండా వెన‌క్కు జ‌రుగుతూ యోగాలు చేస్తున్న‌ట్టు వొంపులు తిర‌గ‌డంతో ఆమె ఏం చేస్తుందో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు.

వేదిక‌పై ఉన్న వ‌రుడికి ఆమె దండ వేస్తుంది.ఇక వ‌రుడు కూడా ఆమె మెడ‌లో దండ వేసేందుకు సిద్ధ ప‌డుతాడు.అయితే ఆమె మాత్రం అత‌నికి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా వెన‌క్కు జ‌ర‌గ‌డం ఇందులో క‌నిపిస్తుంది.

అత‌ను ఎంత‌లా ప్ర‌య‌త్నించినా స‌రే ఆమె మాత్రం అస్స‌లు త‌గ్గ‌కుండా యోగా చేస్తున్న‌ట్టు హొయ‌లు పోతూ ఉంటుంది.అయితే ఇలా బాగా వెన‌క్కు వంగే స‌రికి ఆమె ఇబ్బంది ప‌డుతుంది.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇక పైకి లేచేందుకు వ‌రుడు సాయం చేస్తాడు.కాగా ఇందుకు సంబంధించిన వీడియో మీద చాలామంది చాలా ర‌కాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

 మ‌రి లేటెందుకు మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు