నేరేడు పండు విత్త‌నాల‌తో ఇలా చేస్తే..య‌వ్వ‌నంగా మెరిసిపోతార‌ట‌!?

మాయిశ్చ‌రైజ‌ర్లు, ఫేస్ ప్యాకులు, ఫేస్ సీర‌మ్‌లు వాడుతుంటారు.అలాగే బ్యాటీ పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతూ ఫేషియ‌ల్స్ చేయించుకుంటారు.

మ‌రికొంద‌రు ట్రీట్‌మెంట్ల‌ వ‌ర‌కు కూడా వెళ్తారు.అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా న్యాచుర‌ల్‌గానూ ముఖాన్ని య‌వ్వ‌నంగా మెరిపించుకోవ‌చ్చు.

అందుకు నేరేడు పండు విత్త‌నాలు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి చ‌ర్మానికి నేరేడు పండు విత్త‌నాల‌ను ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా నేరేడు పండ్ల నుంచి విత్త‌నాల‌ను తీసుకుని ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నెలో నేరేడు పండు విత్త‌నాల పొడి ఒక స్పూన్‌, బాదం ఆయిల్ ఒక స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేస్తే ముడ‌త‌లు, స‌న్న‌టి గీత‌లు పోయి చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మారుతుంది.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ నేరేడు పండు విత్త‌నాల పొడి, ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడ‌ర్‌, రెండు స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసి ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు పోతాయి.చ‌ర్మ ఛాయ కూడా పెరుగుతుంది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఇక ఒక బౌల్‌లో ఒక స్పూన్ నేరేడు పండు విత్త‌నాల పొడి, అర‌ స్పూన్ పెస‌ర పిండి మ‌రియు రెండు స్పూన్ల పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

Advertisement

ప‌ది నిమిషాల త‌ర్వాత మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి.

ఇలా చేస్తే మృత క‌ణాలు పోయి ముఖం తాజాగా, ప్ర‌కాశవంతంగా మెరుస్తుంది.మ‌రియు చ‌ర్మం తేమగానూ మారుతుంది.

తాజా వార్తలు