అక్కినేని హీరోల క్రేజ్ తగ్గిందా.. బంగార్రాజు వసూళ్లే అందుకు ప్రూఫా?

సాధారణంగా ప్రతి సంక్రాంతి పండుగకు స్టార్ హీరోలు నటించిన సినిమాలు థియేటర్ వద్ద తీవ్ర స్థాయిలో పోటీ పడతాయి అనే విషయం మనకు తెలిసిందే.

ఇలా స్టార్ హీరోలు నటించిన సినిమాలన్నీ ఒకేసారి సంక్రాంతి బరిలో దిగడంతో నువ్వా నేనా అనే పోటీ నెల కొంటుంది.

అయితే ఈ ఏడాది కూడా సంక్రాంతి పోటీ బీభత్సంగా ఉంటుందని చాలా మంది భావించారు.ఎందుకంటే సంక్రాంతి బరిలో ఎన్నో పాన్ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

ఇలా నువ్వా నేనా అంటూ పోటీ లోకి దిగిన ఈ చిత్రాలకు కరోనా పోటీ నుంచి వెనక్కి లాగిందని చెప్పవచ్చు.పాన్ ఇండియా చిత్రాలు కావడంతో ఈ సినిమాలను దేశ వ్యాప్తంగా విడుదల చేయాలి.

ఈ క్రమంలోనే ఉత్తరాది రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో పలు సినిమాలను వాయిదా వేశారు.అయితే ఈ సమయాన్ని నాగార్జున బంగార్రాజు టీమ్ ఎంతో అద్భుతంగా ఉపయోగించుకున్నారని చెప్పవచ్చు .ఇలా సంక్రాంతి బరిలో పాన్ ఇండియా చిత్రాలు ఉంటాయని తెలియడంతో ఆ సినిమాల ముందు బంగార్రాజు సినిమా చాలా చిన్న సినిమాగా కనిపించింది.అయితే అనుకోని విధంగా ఆ సినిమాలన్నీ వాయిదా పడడంతో సంక్రాంతికి బంగార్రాజు పెద్ద సినిమాగా విడుదలైంది.

Advertisement

ఇక ఈ సినిమాకి పోటీగా ఇతర సినిమాలు లేకపోవడంతో సంక్రాంతి పండుగను బంగార్రాజు బాగా క్యాష్ చేసుకున్నారని చెప్పవచ్చు.

ఇలా ఈ సినిమాకు ఇతర ఏ సినిమాలు పోటీలేవని తెలియడంతో బయ్యర్లు కూడా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేయడం కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 38 కోట్లకు పైగా చేసినట్లు సమాచారం.విడుదలకు ముందే ఈ విధంగా బిజినెస్ చేసిన ఈ సినిమా విడుదలైన మొదటి వారం కలెక్షన్ పరంగా దూసుకు పోతోంది.

ఇలా మొదటి వారం అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన బంగార్రాజు ఆ తర్వాత కలెక్షన్ల పరంగా కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది.ఈ విధంగా ఈ సినిమా విడుదలైన 20 రోజులలో కలెక్షన్లు బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చి తడబడినట్లు తెలుస్తుంది.

ఇలా మొదటి రెండు వారాలు కలెక్షన్ ఎంత బాగా రాబట్టినప్పటికీ ఈ సినిమా 20వ రోజు ప్రసారం అయినప్పటికీ అన్ని ఏరియాలలో కలిపి కేవలం పది లక్షల షేర్స్ మాత్రమే రావడంతో ఇక్కడితో అక్కినేని హీరోల హవా పూర్తిగా ముగిసి పోయిందని తెలుస్తోంది.ఇక ఈ సినిమా విడుదలైన 20 రోజులకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లను చూస్తే 38.12 కోట్ల నెట్, 64.07 కోట్ల గ్రాస్ వసూలు అయినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా మరో 88 లక్షలు రాబడితే బ్రేక్ ఈవెన్ మార్క్ అయినా 39 కోట్లను దాటుతారు.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

మరి ఈ వారంలో బంగార్రాజు ఈ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటుతారా.లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు