అందుకోసం 4 వేల కి.మీ.ల నడక నడవబోతున్న మాజీ సైనికుడు..!

మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు సాగుతూ ఉంటాడు.

ఉన్న వాడైనా సరే, లేని వాడైనా సరే జీవితంలో ముందుకు వెళ్లే కొద్దీ ఎన్నో అవాంతరాలను దాటుకుంటూ వారికి ఇష్టమైన రంగంలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు.

ఇలా జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో కొంతమందికి అనుకోని సంఘటనల వల్ల వారి జీవితం మలుపు తిరుగుతుంది.అలా మలుపు తిరగడం ద్వారా ఎంతో మంది వారి జీవితానికి సంబంధించిన విషయాలను నలుగురితో పంచుకుంటూ వారికి రోల్ మోడల్ గా నిలవడం, లేకపోతే వారికి ఒక ఫిలాసఫర్ లాగా ఉండటం చేస్తుంటారు.

ఇక అసలు విషయంలోకి వెళితే.జార్ఖండ్ రాజధాని రాంచీ నగరానికి చెందిన రోనిత్ రంజాన్ అనే యువకుడు ఓ సదుద్దేశంతో ఏకంగా భారత దేశంలో 4000 కిలోమీటర్లు నడిచేందుకు సిద్ధమయ్యాడు.

అంతేకాదు, ఇప్పటికే ఈ 4000 కిలోమీటర్లలలో 1250 కిలోమీటర్ల నడకను కూడా పూర్తి చేశాడు.రోనిత్ రంజాన్ ఇదివరకు సైన్యంలో పని చేసేవాడు.

Advertisement
Socail Activist, Military, Mental Health, Ronit Ramzan, Ranchi, India, Roaming O

అయితే దురదృష్టవశాత్తు 2017 లో ఆయన వెన్నెముక గాయం కారణంగా సైన్యంలోని అధికారులు ఆయనను బాధ్యతల నుంచి తప్పించారు.దీంతో ఆయన చేసేది ఏమీ లేక తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

ఈ సంఘటన జరిగిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు రోనిత్.ఆ తర్వాత అతడు డాక్టర్ల సహకారంతో ట్రీట్మెంట్ తీసుకొని అందులో నుంచి బయటపడగలిగాడు.

Socail Activist, Military, Mental Health, Ronit Ramzan, Ranchi, India, Roaming O

ఇలా అతను డిప్రెషన్ లో నుండి బయటికి వచ్చిన తర్వాత ఓ సదుద్దేశంతో భారతదేశంలోని 4000 కిలోమీటర్లు నడవడానికి సిద్ధమయ్యాడు.ప్రజల్లో మానసిక ఆందోళన పై అవగాహన కల్పించేందుకు అతడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు.అయితే తన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి చేర్చడం ఉద్దేశంతో.

ఆ పని ప్రతి ఒక్కరిని కలవడం ద్వారానే ఎక్కువ మందిలో ఈ విషయంపై అవగాహన కల్పించవచ్చని నేపథ్యంతో అతడు నడక మొదలు పెట్టాడు.గత సంవత్సరం నవంబర్ 16న కన్యాకుమారిలో ఈయన తన నడకను మొదలుపెట్టగా దేశం మొత్తం నడకతో పూర్తిచేసి లడక్ ప్రాంతంలో ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుతానని ఆయన తెలియజేశాడు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!

ప్రస్తుతం ఈయన హైదరాబాద్ నగరానికి చేరుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు