నవ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య మనం లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్యూ.సక్సెస్ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది.
టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి మారో మారో అనే యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం.యూత్‌ఫుల్ మాస్ కాలేజ్‌గా పాటగా చిత్రంలో వుండే ఈ సాంగ్‌కు సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించగా, దీపు అండ్ ప్రదీప్ చంద్ర ఆలపించారు.
ఈ క్యాచీ పాటకు విశ్వ అండ్ కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు.లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
బీవీఎస్ రవి కథను అందించారు.సినిమా జూలై 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy