Bandi Sanjay : బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత

హన్మకొండ జిల్లాలో బీజేపీ ఎంపీ బండి సంజయ్( BJP MP Bandi Sanjay ) నిర్వహిస్తున్న ప్రజాహిత యాత్రలో( Prajahita Yatra ) ఉద్రిక్తత నెలకొంది.

భీమదేవరపల్లి మండలం వంగరలో( Vangara ) బండి సంజయ్ కాన్వాయ్ పై కాంగ్రెస్ శ్రేణులు కోడిగుడ్లతో దాడి జరిగింది.

అనంతరం బండి సంజయ్ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.ప్రజాహిత యాత్రకు ఆటంకాలు కల్పిస్తున్న కాంగ్రెస్ శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని

బండి సంజయ్ పోలీసులను కోరారు.కావాలనే తమ యాత్రను కాంగ్రెస్( Congress ) అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు.గత కొన్ని రోజులుగా బండి సంజయ్, కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.

ఈ క్రమంలోనే నిన్న రాముపపల్లిలో బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.

Advertisement
నాన్నలేని లోటును ఆమె తీర్చారు.... ఎమోషనల్ అయిన ఎన్టీఆర్! 

తాజా వార్తలు